Viral Video: ఉబ్బిన పొట్టతో కదులుతూ కనిపించిన కొండచిలువ.. కాసేపటికి కక్కింది చూడగా

కొండచిలువ పరిమాణంలో భారీగా ఉంటాయి. వాటిని దూరం నుంచి చూస్తేనే దెబ్బకు షాక్ అవుతాం. మరి అలాంటి ఓ కొండచిలువ తన మీల్స్ ఆరగిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది.? ఏం చేస్తుందో.? మీరు చూసేయండి. ఈ ఆర్టికల్ ఓ సారి లుక్కేయండి మరి.

Viral Video: ఉబ్బిన పొట్టతో కదులుతూ కనిపించిన కొండచిలువ.. కాసేపటికి కక్కింది చూడగా
Trending

Updated on: Jul 05, 2025 | 11:59 AM

కొండచిలువ.. పరిమాణంలోనే కాదు.. సరీసృపాలలో బలమైనది. జంతువులతో పాటు మనుషులను కూడా అమాంతం మింగేస్తుంది. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలు తెరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. చావుబ్రతుకల మధ్య సాగే ఈ జంతుప్రపంచం.. రోజుకో మరణశాసనమే. తాజాగా ఓ కొండచిలువకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో జార్ఖండ్‌లోని బలేదిహా గ్రామానికి చెందినది. ఇందులో ఓ పెద్ద కొండచిలువ ఉబ్బిన పొట్టతో తెగ అవస్థలు పడుతూ.. ముందుకు పాకుతూ కనిపిస్తుంది. అలాగే దాని నోట్లో నక్క కళేబరాన్ని చూడవచ్చు. నక్క కళేబరాన్ని సగం భాగం మింగిన కొండచిలువ.. ఆపై మిగిలినది మింగడంలో తీవ్ర అవస్థలు పడుతోంది. అది మింగడంలో దాని పరిస్థితి చాలా దారుణంగా మారిందని చెప్పొచ్చు.

ఇది చదవండి: ఎలారా ఇలా.! పైకి అదొక పైనాపిల్ లోడ్ ఆటో.. లోపల చెక్ చేయగా కళ్లు తేలేశారు

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియోను ఇన్‌స్టాలో సహ్రే చేయగా.. దీనిపై వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కొండచిలువలు చాలా ఆకలితో ఉంటాయి. నిజంగా ప్రమాదకరమైన వేటగాళ్లు ఈ కొండచిలువలు. అవి 5-10 రోజులకు ఒకసారి తింటాయి. పెద్ద కొండచిలువలు నెలకు ఒకసారి తమ ఆహారం పరిమాణాన్ని బట్టి తింటాయని మీకు తెల్సా.

ఇది చదవండి: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇదిగో

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..