ప్రపంచంలోనే అత్యంత వృద్దురాలు.. వయసెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డులో తన పేరును నమోదు చేసుకున్నారు 119 ఏళ్ల వృద్ధ మహిళ. అవును.. బ్రెజిల్‌లోని రియో​డి జెనీరో రాష్ట్రానికి చెందిన డియోలిరా గ్లిసెరియా పెడ్రో డా సిల్వా అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ప్రస్తుతం 119 ఏళ్ల వయసున్న ఈ బామ్మ మరో రెండు నెలల్లో 120వ పుట్టినరోజు జరుపుకోనుందని సమాచారం.

ప్రపంచంలోనే అత్యంత వృద్దురాలు.. వయసెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
119 Year Old Brazilian Woma

Updated on: Jan 19, 2025 | 1:21 PM

చాలా మంది వ్యక్తులు కొన్ని ప్రత్యేకమైన, అరుదైన ఫీట్ చేయడం ద్వారా గిన్నిస్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంటారు. అయితే ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డులో తన పేరును నమోదు చేసుకున్నారు 119 ఏళ్ల వృద్ధ మహిళ. అవును.. బ్రెజిల్‌లోని రియో​డి జెనీరో రాష్ట్రానికి చెందిన డియోలిరా గ్లిసెరియా పెడ్రో డా సిల్వా అనే మహిళ ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా నిలిచారు. ప్రస్తుతం 119 ఏళ్ల వయసున్న ఈ బామ్మ మరో రెండు నెలల్లో 120వ పుట్టినరోజు జరుపుకోనుందని సమాచారం.

కాగా, పెడ్రో డా సిల్వాను ప్రపంచంలో అత్యంత సజీవ వృద్దురాలిగా రికార్డులో నమోదు చేయాలని ఆమె మనుమరాలు కోరింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ సంస్థకు ఓ లేఖను కూడా రాసింది. పెడ్రో 1905 మార్చి 10న జన్మించినట్లు ఆధారాలు ఉన్నాయని, ఆమెకు ప్రస్తుతం 119 ఏళ్ల వయసు ఉన్నట్లు, ఆరోగ్యాంగానే ఉన్నారని అక్కడి వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us