Uttarakhand: మంచు కొండచరియలు విరిగిపడి 10 మంది పర్వతారోహకుల దుర్మరణం.. 11 మంది గల్లంతు..

|

Oct 04, 2022 | 4:47 PM

ఉత్తరాఖండ్‌లో మరోసారి మంచు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 29 మంది ట్రైనీ పర్వతారోహకులు గ‌ల్లంతయ్యారు. అందులో పది మంది పర్వతారోహకులు మృతి చెందారు.

Uttarakhand: మంచు కొండచరియలు విరిగిపడి 10 మంది పర్వతారోహకుల దుర్మరణం.. 11 మంది గల్లంతు..
Uttarakhand Avalanche
Follow us on

ఉత్తరాఖండ్‌లో మరోసారి మంచు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 29 మంది ట్రైనీ పర్వతారోహకులు గ‌ల్లంతయ్యారు. అందులో పది మంది పర్వతారోహకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దిగి 8 మందిని కాపాడారు. మిగిలిన 11 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఘ‌ర్‌వాల్ హిమాల‌య ప్రాంతంలోని గంగోత్రి స‌మీపంలో ఈ ప్రమాదం జరిగింది. ద్రౌప‌ది దండా-2 ప‌ర్వతం దగ్గర వీరంతా గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన‌ 40 మందితో కూడిన ఓ బృందం ట్రెక్కింగ్‌కు వెళ్లింది. వారిలో 33 మంది ట్రైనీలు, ఏడుగురు ఇన్‌స్ట్రక్టర్లు ఉన్నారు. అయితే.. ఒక్కసారిగా హిమపాతం దూసుకురావడంతో 29 మంది ట్రైనీలు చిక్కుకుపోయారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క‌చ‌ర్యల్లో పాల్గొన్నాయి.

కాగా.. పది మంది ట్రైనీల మరణాన్ని పర్వతారోహణ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ప్రాణనష్టాన్ని ధృవీకరించారని వార్తా సంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఎనిమిది మందిని రక్షించారని.. మరో 11 మంది కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు సహాయక చర్యలు చేపడుతున్నాయని ఉత్తరాఖండ్ పోలీస్ చీఫ్ అశోక్ కుమార్ తెలిపారు.16,000 అడుగుల ఎత్తులో ఉండగా.. ఉదయం 9 గంటల సమయంలో హిమపాతం దూసుకొచ్చినట్లు తెలిపారు. గాయపడిన ట్రైనీలను 13,000 అడుగుల ఎత్తులో ఉన్న సమీపంలోని హెలిప్యాడ్‌కు, ఆపై రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌కు తరలిస్తున్నట్లు రెస్క్యూ అధికారి తెలిపారు.

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని.. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కార్యాలయం తెలిపింది. వేగంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడి సైన్యం సహాయం కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందని హామీ ఇచ్చారని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్  చేయండి..