ఢిల్లీలో మరోసారి గ్యాంగ్ ‌రేప్‌ ఆరోపణలు !

ఢిల్లీలో మరోసారి గ్యాంగ్‌రేప్‌ ఆరోపణలు కలకలం రేపాయి. కనాట్ ప్లేస్ మార్కెట్‌కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఇండియా గేట్‌ దగ్గర్లో ఉన్న ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో గ్యాంగ్ రేప్ జరిగినట్లు ఆదివారం బాధిత మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. న్యూఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఐష్ సింఘాల్ తెలిపిన వివరాల ప్రకారం.. హైసెక్యూరిటీ జోన్‌ అయిన సెంట్రల్‌ ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో టికెట్‌ బుకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, టూరిస్ట్‌ గైడ్‌గా పనిచేస్తున్న ఓ మహిళపై గ్యాంగ్ రేప్ […]

  • Ram Naramaneni
  • Publish Date - 11:16 pm, Mon, 21 September 20

ఢిల్లీలో మరోసారి గ్యాంగ్‌రేప్‌ ఆరోపణలు కలకలం రేపాయి. కనాట్ ప్లేస్ మార్కెట్‌కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఇండియా గేట్‌ దగ్గర్లో ఉన్న ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో గ్యాంగ్ రేప్ జరిగినట్లు ఆదివారం బాధిత మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. న్యూఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఐష్ సింఘాల్ తెలిపిన వివరాల ప్రకారం.. హైసెక్యూరిటీ జోన్‌ అయిన సెంట్రల్‌ ఢిల్లీలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో టికెట్‌ బుకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, టూరిస్ట్‌ గైడ్‌గా పనిచేస్తున్న ఓ మహిళపై గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లు బాధిత మహిళ కంప్లైంట్ చేసింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న​ వ్యక్తులు నేరం జరిగిన హోటల్‌లో రూమ్ బుక్‌  చేసుకున్నారు. అదే హోటల్‌లో టికెట్‌ బుకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న మహిళకు డబ్బు అవసరం ఉన్నట్లు వారు గుర్తించారు. వెంటనే ఆమెకు తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామని నమ్మించి  ఆమెను హోటల్‌ గదికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధిత మహిళ ఫిర్యాదుతో ఓ మహిళ సహా ఆరుగురు వ్యక్తులపై ఐపీసీ సెక్షన్‌ 376డి, 323, 34ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఘటనలో ప్రధాన నిందితుడైన మనోజ్‌ శర్మ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Also  Read :

రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ !

సామాన్యులకు మరో షాక్, పెరగనున్న టీవీల ధరలు

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కోడిగుడ్డు ధర !