Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. 52 లక్షల 14 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 96,424 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 1174 మంది మృతి . గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 87,472 • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 52,14,678 • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 10,17,774 • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 41,12,551 • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 84,372 . దేశంలో 78.86 శాతం కరోనా రోగుల రికవరీ రేటు . దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 19.52 శాతం . దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.62 శాతానికి తగ్గిన మరణాల రేటు . గడచిన 24 గంటలలో దేశంలో నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 10,06,615 . దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 6,15,72,343
  • విజయవాడ : ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు. మాచవరం పిఎస్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్. అర్ధరాత్రి పోలీసుల దాడులు. టీవీ , ల్యాప్ టాబ్, 23 లైన్లో ఉన్న ఫోన్ బాక్స్ , 25 ఫోన్లు స్వాధీనం. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కీలక వ్యక్తి నవీన్ కోసం గాలింపు. క్రికెట్ బుకీలతో ఉన్న సంబంధాల పై విచారణ చేస్తున్న పోలీసులు.
  • జిహెచ్ఎంసి భారీ జరిమానాలు. పదో తారీకు నుంచి 17 వ తారీకు వరకు సుమారు యాభై లక్షలు జరిమానా విధింపు. సింహభాగం బడా షాపింగ్ మాల్స్ దే. బిగ్ బజార్ కు 5 లక్షల 2 వేలు అత్యధిక జరిమానా. చెన్నై షాపింగ్ మాల్ కి 4 లక్షలు. జిపిఆర్ మల్టీప్లెక్స్ 3 లక్షలు. సోనోవిజన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ కు రెండు లక్షల 50 వేల చొప్పున జరిమానా. విఆర్కే సిల్క్, బాంటియా ఫర్నిచర్, ఎల్జి షోరూం కు రెండు లక్షలు చొప్పున జరిమానా. కాచిగూడ ఐనాక్స్ కు ఒక లక్ష ఇరవై రెండు వేల జరిమానా. హ్యాపీ మొబైల్స్ ,ఓయో ,రిలయన్స్ డిజిటల్, విజేత సూపర్ మార్కెట్, ఇంపీరియల్ రెస్టారెంట్ కు లక్ష రూపాయల చొప్పున జరిమానా. అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు , బ్యానర్లు పై భారిగా జరిమానా లు వేస్తున్న జిహెచ్ఎంసి అధికారులు.
  • అమరావతి : విశాఖ సముద్రంలో విషపూరిత కాలుష్యంపై హైకోర్ట్ లో పిల్ దాఖలు. సముద్ర కాలుష్యంపై నిపుణుల కమిటీ విచారణ కోరుతూ పిల్. పిటిషన్ దాఖలు చేసిన బోలిసెట్టి సత్యనారాయణ, తరుణ్ భారత్ సంఘo వ్యవస్థాపక చైర్మన్ రాజేంద్ర సింగ్. విశాఖలోని రుషికొండ బీచ్‌ చెత్త, వ్యర్థాలు, ప్లాస్టిక్‌, విష పదార్థాలతో కలిసి కలుషితమవుతోందని పిటిషన్. సముద్ర సంపదకు ముప్పు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ప్రజాహిత పిటిషన్ దాఖలు. మెరైన్‌ బయాలజీ, మెరైన్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌, ఇండిస్టీస్‌ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. విశాఖతో పాటు కాకినాడ, ఇతర తీరప్రాంతాల్లో కమిటీతో అధ్యయనం చేయించాలని కోరిన పిటిషనర్లు. పరవాడలోని ఫార్మా కంపెనీల నుంచి విష పదార్థాలు, చెత్త విశాఖ మీదుగా పెద్దజాలరిపేట దగ్గర సముద్రతీరంలో కలుస్తోందన్న పిటిషనర్లు. సముద్ర జలాలతోపాటు ఇతర నీటి వనరులు కూడా కలుషితమవుతున్నాయన్న పిటిషనర్లు. ఇలాగే వదిలేస్తే వృక్షాలు, పక్షులపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన. ఫార్మాకంపెనీలు ఎన్వి రోన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, వాటెర్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ వాటెర్, ల్యాండ్ అండ్ ట్రీస్ చట్టాన్ని ఉల్లంఘిస్తోందన్న పిటిషనర్లు. రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రధాన కార్యదర్శి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ, కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి, విశాఖ జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా‌ చేర్చిన పిటిషనర్లు.
  • తిరుమల: నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. రేపటి నుంచి ఈ నెల 27 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఏకాంత బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీవారి ఆలయం. కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్న టీటీడీ.
  • అమరావతి: చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ. భేటీకి హాజరైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ చంద్రబాబు . దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపణ. ఎంపీ దుర్గాప్రసాద్‌ సంతాప తీర్మానంపై పార్లమెంట్‌లో చర్చను.. వైసీపీ బాయ్‌కాట్ చేయడం నీచం- చంద్రబాబు. కనీసం ఎంపీ కుటుంబసభ్యులను సీఎం జగన్ పరామర్శించలేదు. రాష్ట్రానికి జీఎస్టీ నిధులు రాబట్టడంపై వైసీపీకి శ్రద్ధలేదు-చంద్రబాబు. అంతర్వేది సహా ఆలయాల దాడులపై సీబీఐ దర్యాప్తు చేయాలి- చంద్రబాబు.

టాప్ 10 న్యూస్ @ 6PM

Top 10 News of The Day 04062019, టాప్ 10 న్యూస్ @ 6PM

1.లోక్‌సభ స్పీకర్‌ కుర్చీలో మిథున్‌రెడ్డి

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ హోదాలో కుర్చీలో కూర్చోని లోక్‌సభను నడిపించారు. లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైన ఆయన గురువారం ఆధార్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభకు అధ్యక్షత వహించారు…Read more

2.మీకెే భాషొచ్చు? బ్యాంకు పరీక్షకు నో రూల్!

బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి పోటీ పరీక్షలు ఇప్పటివరకు ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే రాయాల్సి వస్తోంది. దీంతో వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల్లో చదువుకున్న విద్యార్థులు పరీక్షల సమయంలో…Read more

3.ఎకనమిక్ సర్వే లో జీడీపీ వృద్ది రేటు ఎంత ?

2019-20 సంవత్సరానికి స్థూల దేశీయ వృద్ది (జీడీపీ) రేటును 7 శాతం గా ఆర్ధిక సర్వే పేర్కొంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఇది 6.8 శాతంగా ఉన్న విషయాన్ని ఈ సర్వే గుర్తు చేసింది. ఈ సర్వే ను గురువారం…Read more

4.కోర్టుకు రాకుంటే బెయిల్ క్యాన్సిల్ చేస్తాం: సల్మాన్‌కు హెచ్చరిక

కృష్ణజింకలను వేటాడిన కేసు బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ను వదలడం లేదు. ఈ కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్.. రెండు రోజులు జైలులో ఉండి ఆ తరువాత బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం…Read more

5.ఆ నిధులు కూడా మింగేశారు: ఎంపీ విజయసాయి ట్వీట్

రాజకీయ నేతలు ప్రత్యక్షంగా కంటే పరోక్షంగానే యుద్ధాలు చేసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అధికార విపక్షాల మధ్య ట్విట్టర్ వేదికగా ఇరుపార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు…Read more

6.గీటు దాటావో… వేటు తప్పదు!

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిషేధం ముంగిట ఉన్నాడు. ఇప్పటికే టోర్నీ లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. ఆరు విజయాలతో సెమీస్ బెర్తుని ఖాయం చేసుకోగా…Read more

7.వివేకా హత్యకేసులో నార్కో పరీక్షలు

వైసీపీ నేత, సీఎం జగన్ బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు నార్కో ఎనాలసిస్ టెస్టులకు రెడీ అయ్యారు సిట్ అధికారులు. రెండున్నర నెలలుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు…Read more

8.నామినేటేడ్ పదవులకు జగన్ గ్రీన్ సిగ్నల్..

ఏపీ నామినేటేడ్ పదవులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రస్థాయిలో కొందరి పేర్లను ముఖ్యమంత్రి ఖరారు చేసినట్లు సమాచారం…Read more

9.‘సాహో’ ఐటెం సాంగ్.. ప్రభాస్‌తో చిందేయనున్న జాక్వెలిన్!

ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ షూట్ జరుగుతోంది. ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్లలో…Read more

10.మద్యం బాటిళ్లపై మహాత్ముడి ఫోటో..!

జాతిపిత మహాత్మా గాంధీ ఫోటోను బీరు బాటిళ్లపై ముద్రించి భారతీయుల మనోభావాలను దెబ్బతీసింది ఇజ్రాయిల్‌కు చెందిన బీరు ఉత్పత్తుల కంపెనీ. మోడ్రన్ డ్రెస్‌, న‌ల్లక‌ళ్లజోడుతో ఉన్న గాంధీ ఫోటోను…Read more

Related Tags