మద్యం బాటిళ్లపై మహాత్ముడి ఫోటో..!

జాతిపిత మహాత్మా గాంధీ ఫోటోను బీరు బాటిళ్లపై ముద్రించి భారతీయుల మనోభావాలను దెబ్బతీసింది ఇజ్రాయిల్‌కు చెందిన బీరు ఉత్పత్తుల కంపెనీ. మోడ్రన్ డ్రెస్‌, న‌ల్లక‌ళ్లజోడుతో ఉన్న గాంధీ ఫోటోను మార్ఫింగ్ చేసి బీరు బాటిల్‌పై ముద్రించారు. దీనిపై భారత నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. పాపులారిటీ కోసం ఇలాంటి చిల్లర పనులు చేయడం సరికాదని హితవు పలికారు. వెంటనే బీరు బాటిల్‌పై గాంధీ బొమ్మను తొలిగించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ సంస్థ చైర్మన్ […]

మద్యం బాటిళ్లపై మహాత్ముడి ఫోటో..!
Follow us

|

Updated on: Jul 04, 2019 | 5:42 AM

జాతిపిత మహాత్మా గాంధీ ఫోటోను బీరు బాటిళ్లపై ముద్రించి భారతీయుల మనోభావాలను దెబ్బతీసింది ఇజ్రాయిల్‌కు చెందిన బీరు ఉత్పత్తుల కంపెనీ. మోడ్రన్ డ్రెస్‌, న‌ల్లక‌ళ్లజోడుతో ఉన్న గాంధీ ఫోటోను మార్ఫింగ్ చేసి బీరు బాటిల్‌పై ముద్రించారు. దీనిపై భారత నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. పాపులారిటీ కోసం ఇలాంటి చిల్లర పనులు చేయడం సరికాదని హితవు పలికారు. వెంటనే బీరు బాటిల్‌పై గాంధీ బొమ్మను తొలిగించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ సంస్థ చైర్మన్ ఎబీజే జోస్ సదరు కంపెనీ చర్యను తీవ్రంగా ఖండించారు. కాగా ఈ ఘటనపై ఇజ్రాయిల్‌కు చెందిన లిక్కర్ కంపెనీ మకా బ్రూవరీ క్షమాపణ చెప్పినట్టు జాతీయ మీడియా పేర్కొంది.

తమ బీరు సీసాలపై గాంధీ ఫోటోను పెట్టినందుకు గానూ సదరు కంపెనీ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. ఇజ్రాయెల్ 71 వ స్వాతంత్య్ర దినోత్సవం  సందర్భంగా బీరు సీసాలపై ప్రముఖుల ఫొటోలను ముద్రించింది. వాటిలో ఇజ్రాయిల్‌కు చెందిన ముగ్గురు ప్రధాన మంత్రుల ఫొటోలతో పాటు మహాత్ముడి ఫోటో కూడా పెట్టడంపై విమర్శలు రావడంతో మనోభావాలను దెబ్బతీసినందుకు భారతీయులకు, భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతున్నట్లు సదరు కంపెనీ పేర్కొంది. మహాత్మా గాంధీని మేము ఎంతో గౌరవిస్తామని.. మా మద్యం సీసాలపై ఆయన ఫోటోను ముద్రించినందకు చింతిస్తున్నామంటూ మకా బ్రూవరీ లిక్కర్ సంస్థ ప్రకటన విడుదల చేసింది.