Breaking News
  • విజయవాడ: డిజిపి గౌతమ్ సవాంగ్.. కామెంట్స్. టెక్క్నాలజీ, ఇన్నోవేషన్ ఐడియాలు, ఇతర అంశాలు ల్లో జాతీయ స్థాయిలో 26 అవార్డ్స్ దక్కాయి. 34 ఏళ్ల లో ఇలాంటి వెనుకబడి వర్గాలకు త్వరితగతిన న్యాయం చేయడం ఇదే ప్రధమ. చీరాల ఘటనలో ఎస్.ఐ పై చాలా వేగంగా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి ఘటనల్లో ఎవరిని ఉపేక్షించేది లేదు, చీరాల సంఘటనలో పోలీస్ అధికారి పైనే చర్యలు తీసుకున్నాం, గతంలో ఏ ప్రభుత్వ హయాంలో వేగవంతంగా ఇలాంటి చర్యలు తీసుకోలేదు . జాతీయ స్ధాయిలో 26 అవార్డులు రావడం అత్యంత సంతోషకరం. చాలా అభివృద్ధి, మార్పలు, టెక్నాలజీ వినియోగం ఆధారంగా జాతీయ స్థాయిలో 26 అవార్డులు వచ్చాయి. 9 గంటలకు ఆగష్టు 15 వేడుకలు జరుగుతాయి. శిరోముండనం విషయం మా దృష్టికి రాగానే కేసు పెట్టి, ఒక ఎస్సైని అరెస్టు చేసి రిమాండ్ కు పంపాం. ప్రభుత్వం మాకు పూర్తి ఆదేశాలు ఇచ్చింది, ఎలాంటి పరిస్ధితులలోనూ కేసులకు వెనకాడవద్దు. స్వర్ణప్యాలెస్ ఘటనలో కచ్ఛితంగా బాధ్యులపై చర్యలుంటాయి. ప్రాధమిక దర్యాప్తులో ముగ్గురుని స్వర్ణప్యాలెస్ ఘటనలో అరెస్టు చేశాం.
  • రాంగోపాల్ వర్మ తాజాగా ప్రకటించిన "అర్నబ్ ద న్యూస్ ప్రాస్టిట్యూట్" సినిమా మోషన్ పోస్టర్ విడుదల. సుశాంత్ సింగ్ మరణం తరువాత మీడియాలో వచ్చిన కొన్ని వార్తల పట్ల ఘాటుగా స్పందించిన వర్మ. బాలీవుడ్ పెద్దలు మీడియాకు భయపడి దాక్కున్నారంటూ వ్యాఖ్యలు. ఆనేపద్యంలో ఆర్నాబ్ పై సినిమా చేస్తానని ప్రకటన.
  • విజయవాడ: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ap ప్రభిత్వం ఉత్తర్వులు. హౌస్ సర్జన్, పిజి డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు పెంపు. ఎంబీబీఎస్ విద్యార్థులకు 19,589. పిజి డిగ్రీ విద్యార్థులకు 1 ఇయర్ 44,075, 2 ఇయర్ 46,524, 3 ఇయర్ 48, 973 కు పెంపు.
  • అమరావతి : నేడు ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్న పెన్మత్స సరేష్‌బాబు. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఉపఎన్నిక . దివంగత సీనియర్‌ నాయకులు, విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు తనయుడు సురేష్‌బాబు.
  • సంగారెడ్డిలోని అమీన్పూర్ అనాధాశ్రమం లో దారుణం. పద్నాలుగేళ్ల మైనర్ అమ్మాయి పై ఆశ్రమ నిర్వాహకులు అత్యాచారం. అమ్మాయికి మత్తు మందు ఇచ్చి పలుమార్లు అత్యాచారం పాల్పడ్డ నిర్వాహకుడు. నిర్వాహకుడి గదిలోకి ప్రతిరోజు పంపించిన వార్డెన్. అత్యాచార విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపు. తీవ్ర అనారోగ్యంతో బోయిన్పల్లిలోని బంధువుల ఇంటికి వచ్చిన బాలిక. బాలికను ఆసుపత్రికి వెళ్ళితే బయత్పడ్డ అత్యాచార విషయం. అమీన్పూర్ ఆశ్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు . ఆస్పత్రిలో చికిత్స పొందిన మైనర్ బాలిక మృతి. మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడ్డ నిర్వాహకులతో పాటు వార్డెన్ అరెస్ట్ చేసిన పోలీసులు.
  • విజయవాడ : స్వర్ణప్యాలెస్ హోటల్ లో కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదంపై రిపోర్ట్ రెడీ . కలెక్టర్ ఇంతియాజ్ కు రిపోర్ట్ ను నేడు అందచేయనున్న జాయింట్ కలెక్టర్ శివశంకర్ నేత్రుత్వంలోని కమిటీ . నాలుగురోజుల పాటు ఫైర్, విద్యుత్, వైద్య, బధ్రత పై విడివిడిగా రిపోర్టులు రెడీ చేసిన జిల్లా కమిటీ . పూర్తి ఆధారాలను సేకరించిన కమిటీ . స్వర్ణ ప్యాలెస్ లో మే 18 నకోవిడ్ కేర్ సెంటర్ కు అనుమతి కోరిన రమేష్ హాస్పిటల్ యాజమాన్యం . కాని మే 15 నుంచే స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్వహిస్తున్న రమేష్ హాస్పిటల్‌. నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రాంతాలలో కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతులు లేవని నిర్ధారించిన కమిటీ . స్వర్ణా ప్యాలెస్‌ లో అగ్ని ‌ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఇవ్వకపోవడం.. కొద్దిసేపు ప్రయత్నించి మంటలు చెలరేగిన తర్వాత ఫైర్‌కి సమాచారం ఇచ్చారంటూ నివేదిక.
  • విశాఖ: వెదర్ అప్ డేట్స్... వాయవ్య బంగాళాఖాతంలో నేడు ఏర్పడనున్న అల్పపీడనం. ఇది రెండు మూడు రోజుల పాటు కొనసాగుతూ ఉత్తర బంగాళాఖాతం మీద కేంద్రీకృతం అవుతుందని వాతావరణ శాఖ అంచనా. ఉత్తరాంధ్ర తీరం నుంచి ఒడిసా, బెంగాల్ వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటన్నిటి ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణల్లో కురవనున్న ఉరుములతో కూడిన వర్షాలు . ఉత్తరాంధ్రలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు....ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. కోస్తాంధ్రలో గంటకు 45-55 కిలో మీటర్ల వేగంతో వీస్తోన్న బలమైన గాలులు . మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ.

టాప్ 10 న్యూస్ @1 PM

Top 10 news at 1 PM, టాప్ 10 న్యూస్ @1 PM

1.మంత్రి ప్రశాంత్‌కు వింత సమస్య.. ఏంటో తెలుసా ?

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వింత సమస్యతో తెగ వర్రీ అవుతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ సమస్య కారణంగా సొంతూరుకు వెళ్ళాలంటే కూడా ప్రశాంత్ రెడ్డి ఒకటికి… Read More

2.హైదరాబాద్‌లో సెల్ఫీలకు ఏవి సేఫెస్ట్ జోన్లు..?

ఈ మధ్యకాలంలో యువత ఎక్కడ చూసినా సెల్ఫీలు దిగడం అలవాటుగా మార్చుకున్నారు. పర్యాటక ప్రదేశానికి వెళ్తే చాలు.. కొందరి చేతిలో ముందుగా సెల్ఫీ స్టిక్స్ దర్శనమిస్తుంటాయి. ఏ మాత్రం పరిస్థితులను గమనించకుండా… Read More

3.ఏపీలో పొలిటికల్ పోలరైజేషన్..ఈసారి కలిసే పార్టీలేవంటే ?

ఏపీలో ఇసుక రాజకీయం దుమారం రేపుతోంది. ఇసుక కొరతపై ఆందోళనను పీక్ లెవెల్‌కు తీసుకువెళ్ళేందుకు టిడిపి యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది. ఆల్‌రెడీ ఇసుక అంశంపై… Read More

4.‘తమిళనాడు’ స్మగ్లింగ్ సెంటరా..?

ది స్మగ్లింగ్ సెంటర్‌గా తమిళనాడు మారనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. అధికారులు ఎన్ని రకాలుగా.. అక్రమ రవాణాకు చెక్‌ పెడుతోన్నా.. Read More

5.ప్యారిస్ ఒప్పందం.. భారత్, చైనాలపై ట్రంప్ మండిపాటు

ప్యారిస్ లో కుదిరిన క్లైమేట్ ఒప్పందం నుంచి వైదొలగాలని తాము నిర్ణయం తీసుకోవడానికి భారత్, చైనా దేశాలే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు… Read More

6.భక్తులకు షాక్.. ఇకపై శ్రీవారి లడ్డూ మరింత ప్రియం!

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే శ్రీవారి దర్శనాన్ని సామాన్యులకు సైతం కల్పించాలనే ఉద్దేశంతో పలు సంస్కరణలు చేసిన టీటీడీ.. Read More

7.తప్పుడు ఆధార్ ఇస్తే.. భారీ జరిమానా.!

ఇన్‌కమ్ టాక్స్ అధికారులు టాక్స్ చెల్లింపుదారులకు హెచ్చరిక జారీ చేశారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఆధార్ నెంబర్‌ను తప్పుగా ఎంటర్ చేస్తే.. Read More

8.అనర్హ ఎమ్మెల్యేలకు ‘సుప్రీం’ ఊరట…

జులై నెలలో హైడ్రామాకు తెరలేపి.. కర్నాటకలో ప్రభుత్వం మారడానికి కారకులైన కాంగ్రెస్-జెడిఎస్ రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది… Read More

9.‘ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ‘ న్యాయ సమ్మతమేనా ?

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కేంద్రానికి సిఫారసు చేయడం, దాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేంద్ర మంత్రివర్గ సలహాపై… Read More

10.టాలీవుడ్‌లో రీమేక్‌ల జోరు… ఎవరు మెప్పిస్తారో.?

టాలీవుడ్‌కు కథలు కరువయ్యాయో.. లేక పరభాషా సినిమాల మీద మన హీరోలకు మక్కువ ఎక్కువైందో గానీ.. వచ్చే ఆరు నెలల్లో కనీసం అరడజన్ పైగా రీమేక్ సినిమాలు తెలుగులో.. Read More

Related Tags