Breaking News
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేశ్‌. పుట్టిన‌రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్‌. తార‌క్‌, విజ‌య్‌, శృతిహాస‌న్‌ను నామినేట్ చేసిన‌ మ‌హేశ్‌. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరిన మ‌హేశ్‌. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌న్న మ‌హేశ్‌. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించిన మ‌హేశ్‌.
  • నిజామాబాద్ : ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్​ . ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్. హైద్రాబాద్ లో హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కుటుంబం.
  • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
  • విజయవాడ: ఐడెంటిఫికేషన్ పూర్తి.. స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు... డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు.. మొవ్వ , సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.) మజ్జి గోపి మచిలీపట్నం సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి ) కందుకూరు పవన్ కుమార్ కందుకూరు..ఎం అబ్రహం.. చర్చి ఫాథర్...జగ్గయ్య పేట రాజకుమారి అబ్రహం జగ్గయ్యపేట రమేష్, విజయవాడ.
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో కోవిడ్ పై మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని తన నివాసం నుంచిటెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు చైనాలోని తూర్పు షిజాంగ్ - భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం.

భక్తులకు షాక్.. ఇకపై శ్రీవారి లడ్డూ మరింత ప్రియం!

Tirumala Tirupathi Devasthanam Made A Key Decision To Increase Rates Of Laddoos, భక్తులకు షాక్.. ఇకపై శ్రీవారి లడ్డూ మరింత ప్రియం!

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే శ్రీవారి దర్శనాన్ని సామాన్యులకు సైతం కల్పించాలనే ఉద్దేశంతో పలు సంస్కరణలు చేసిన టీటీడీ.. తాజాగా దేవస్థానం ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే రిజర్వేషన్లు కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతేకాకుండా కొండపై ప్లాస్టిక్‌ను కూడా దశలవారీగా నిషేధించడానికి రంగం సిద్ధం చేసింది. తిరుమలలో ఉండే హోటళ్లు, గృహాల్లో వాటర్ బాటిల్స్‌ వాడకాన్ని నిషేదించడమే కాకుండా.. వీటికి ప్రత్యామ్నాయంగా వాటర్ ప్లాంటులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇక ఇప్పుడు రీసెంట్‌గా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులందరికీ బార్ కోడ్ విధానం ద్వారా లడ్డూలను అందించనున్నట్లు తెలిపింది. అంతేకాక జీఎంఆర్ సంస్థతో కలిసి తిరుమలలోని ఉద్యానవనాలను సైతం అభివృద్ధి చేస్తామని బోర్డు అధికారులు వెల్లడించారు.

తిరుమలలో లడ్డూ దళారులు ఎక్కువైపోయారని.. అందువల్ల లడ్డూ టోకెన్ల దుర్వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకే బార్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా నెలరోజుల్లో రెండంచెల స్కానింగ్ విధానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇక రెండో స్కానింగ్ పాయింట్ వద్ద స్కాన్ చేసిన సమాచారం మాత్రమే లడ్డూ కౌంటర్ల వద్దకు చేరేలా నూతన విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు.

ఇదిలా ఉండగా శ్రీవారి లడ్డూ ధరను కూడా రెట్టింపు చేసే యోచనలో ఉంది టీటీడీ. లడ్డూ క్రయవిక్రయాల్లో ఇప్పటివరకు ఉన్న రాయితీలన్నింటిని రద్దు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఇకపై దర్శనం చేసుకున్న భక్తులకు 160-180 గ్రాముల చిన్న లడ్డూ ఉచితంగా ఇచ్చి.. ఆపై ప్రతీ లడ్డూను రూ.50కి విక్రయించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

Related Tags