‘ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ‘ న్యాయ సమ్మతమేనా ?

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కేంద్రానికి సిఫారసు చేయడం, దాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేంద్ర మంత్రివర్గ సలహాపై ఆమోదించడం జరిగిపోయాయి.( రాజ్యాంగం లోని 356 (1) అధికరణం కింద ఈ చర్య తీసుకోవాలని గవర్నర్ కోరారు). అయితే ఇది న్యాయ సమ్మతమా, కాదా అన్న దానిపై నిపుణులు తర్జనభర్జన పడుతున్నారు. గవర్నర్ తనకు అందిన ‘ ఆబ్జెక్టివ్ మెటీరియల్ ‘ (ఎలాంటి అనుమానాస్పదరహిత మైన నివేదిక) […]

' మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ' న్యాయ సమ్మతమేనా ?
Follow us

| Edited By:

Updated on: Nov 13, 2019 | 11:47 AM

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కేంద్రానికి సిఫారసు చేయడం, దాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేంద్ర మంత్రివర్గ సలహాపై ఆమోదించడం జరిగిపోయాయి.( రాజ్యాంగం లోని 356 (1) అధికరణం కింద ఈ చర్య తీసుకోవాలని గవర్నర్ కోరారు). అయితే ఇది న్యాయ సమ్మతమా, కాదా అన్న దానిపై నిపుణులు తర్జనభర్జన పడుతున్నారు. గవర్నర్ తనకు అందిన ‘ ఆబ్జెక్టివ్ మెటీరియల్ ‘ (ఎలాంటి అనుమానాస్పదరహిత మైన నివేదిక) ఆధారంగా ఈ సిఫారసు చేశారని, ఈ అధికరణం ప్రకారమే ఆయన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అంతే తప్ప, ఏదైనా రాజకీయ ఉద్దేశంతోనో, ఆషామాషీగానో తీసుకున్నది కాదని. 1994 లో ఎస్. ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పును ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్ఛునని అంటున్నారు.

నాడు బొమ్మై కేసులో ఈ ఆర్టికల్ ను దుర్వినియోగం చేయరాదని, ఒక రాష్ట్రంలో కేంద్ర పాలన విధింపునకు రాజకీయ ఉద్దేశంతో, లేక ‘ ఫ్యాన్సీ ‘ (మరోరకమైన) కారణమో ప్రాతిపదిక కాజాలదని 9 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ అధికరణ వినియోగం, దుర్వినియోగంపై ఆ బెంచ్ విస్తృత అధ్యయనం చేసింది.

ఒక గవర్నర్ పంపిన సిఫారసు లేదా నివేదిక వ్యక్తిగతమైన ఉద్దేశమో, కోరికో లేదా అభిప్రాయమో కాదు.. అది తన ముందు సమర్పించిన ఆధారాల ప్రాతిపదికపై చట్టబధ్ధమైనదేనని రాష్ట్రపతి నిర్ధారణకు రావాల్సి ఉంటుంది ‘ అని కోర్టు పేర్కొంది. ఈ విధమైన ‘ మెటీరియల్ ‘ గవర్నర్ లేదా ఇతర మార్గాల ద్వారా రాష్ట్రపతికి పంపిన నివేదికలో లభ్యం కావచ్ఛునని కోర్టు అభిప్రాయపడింది. అలాంటి సమాచారం విశ్వసనీయమైనదని రాష్ట్రపతి సంతృప్తి చెందాల్సి ఉంటుందని, అలాగే ఆ సమాచారం అనుమానరహితమైనదేనని నిర్ధారణకు రావాల్సి ఉంటుందని వివరించింది.

రాజ్యాంగ నిపుణులు 356(1) అధికరణం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు. కేంద్రంలోని రాజకీయ పార్టీలు ఫెడరలిజాన్ని అణగదొక్కడానికి యత్నిస్తే ఈ అధికరణం అడ్డుకుంటుంది. అని న్యాయస్థానం పేర్కొంది. సరైన ఆధారాలు లేని సమాచారం ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధింపును ఎవరైనా సవాలు చేయవచ్చునని.. అలాగే ఆ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి పట్ల రాష్ట్రపతి కూడా నిర్దిష్టమైన అభిప్రాయానికి వఛ్చి ఉండాలని ఆ బెంచ్ వివరించింది. సంబంధిత అధికరణం కింద రాష్ట్రపతి పాలన విధించాలని మంత్రి మండలి సిఫారసు చేస్తే ఆర్టికల్ 74 (1) ప్రకారం రాష్ట్రపతి ఆ మేరకు నిర్ణయం తీసుకుని ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!