ఢిల్లీపై చలి పంజా.. 119 ఏళ్లలో ఇదే అత్యల్పం!

ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రత సోమవారం 119 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది 1901 నుండి అతి చల్లని రోజు అని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రాంతీయ వాతావరణ అంచనా కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఈ రోజు ఉష్ణోగ్రత మాములుగా ఉండాల్సిన దానిలో సగం ఉంటుంది. ఈ రోజు డిసెంబర్ నెలలో నమోదైన అతి చల్లని రోజు అని తెలిపారు. ఈ శీతాకాలంలో ఢిల్లీలో అసాధారణంగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారం, […]

ఢిల్లీపై చలి పంజా.. 119 ఏళ్లలో ఇదే అత్యల్పం!
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2019 | 8:25 PM

ఢిల్లీలో పగటి ఉష్ణోగ్రత సోమవారం 119 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇది 1901 నుండి అతి చల్లని రోజు అని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రాంతీయ వాతావరణ అంచనా కేంద్రం అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఈ రోజు ఉష్ణోగ్రత మాములుగా ఉండాల్సిన దానిలో సగం ఉంటుంది. ఈ రోజు డిసెంబర్ నెలలో నమోదైన అతి చల్లని రోజు అని తెలిపారు.

ఈ శీతాకాలంలో ఢిల్లీలో అసాధారణంగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వారం, కనిష్ట ఉష్ణోగ్రత 2.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.  ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ వద్ద నేటి మధ్యాహ్నం 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సంవత్సరం గత కొన్ని దశాబ్దాలతో పోలిస్తే అత్యంత శీతాకాలం అని వాతావరణ కార్యాలయం తెలిపింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాలు సోమవారం ఉదయం దట్టమైన పొగమంచుతో కప్పబడ్డాయి. అందువల్ల ఢిల్లీకి వెళ్లే 21 విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. చాలా విమానాలు ఆలస్యం అయ్యాయి, ఆరు విమానాలు రద్దు చేయబడ్డాయి. సుమారు 30 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఐఎండి (వాతావరణ శాఖ) రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ తీవ్రమైన చల్లని వాతావరణం ఉత్తర భారతదేశంలో మరో రెండు రోజులు ఉండే అవకాశం ఉంది. ఈ నెలలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 19.15 డిగ్రీల సెల్సియస్. 1997లో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 17.3 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. కాగా.. 1901 సంవత్సరం నుండి పోలిస్తే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదవడం.. ఇది రెండవసారి. 1901 మరియు 2018 మధ్య నాలుగు సందర్భాలలో మాత్రమే (1919, 1929, 1961, 1997) డిసెంబరులో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌కు కంటే తక్కువగా నమోదైంది.

[svt-event date=”30/12/2019,7:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్