అక్కడ పెళ్లి చేసుకుంటే భారీ ప్రోత్సాహకాలు..

పెళ్లి చేసుకునేవారికి జపాన్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్దమైంది. రోజురోజుకూ తగ్గుతున్న జనాభా, ఆర్ధిక సమస్యల కారణంగా పెళ్లి చేసుకోవడానికి యువత నిరాకరిస్తుండటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకునేవారికి సుమారుగా రూ. 4,20,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. (Japan Govt Plans to Offer 6,00,000 Yen to Newlyweds) ‘న్యూలీవెడ్స్ అండ్ న్యూ లైఫ్ సపోర్ట్ ప్రాజెక్ట్’లో భాగంగా అక్కడ మున్సిపాలిటీలలో ఉండాలని నిర్ణయించుకునే జంటలకు వచ్చే ఏప్రిల్ […]

అక్కడ పెళ్లి చేసుకుంటే భారీ ప్రోత్సాహకాలు..
Follow us

|

Updated on: Sep 23, 2020 | 5:16 PM

పెళ్లి చేసుకునేవారికి జపాన్ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్దమైంది. రోజురోజుకూ తగ్గుతున్న జనాభా, ఆర్ధిక సమస్యల కారణంగా పెళ్లి చేసుకోవడానికి యువత నిరాకరిస్తుండటంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకునేవారికి సుమారుగా రూ. 4,20,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. (Japan Govt Plans to Offer 6,00,000 Yen to Newlyweds)

‘న్యూలీవెడ్స్ అండ్ న్యూ లైఫ్ సపోర్ట్ ప్రాజెక్ట్’లో భాగంగా అక్కడ మున్సిపాలిటీలలో ఉండాలని నిర్ణయించుకునే జంటలకు వచ్చే ఏప్రిల్ నుంచి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. దీనితో పెళ్లి చేసుకోవాలనుకునే 40 ఏళ్లలోపు వారికి నగదు రూపంలో ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఆయా జంటలకు వార్షిక ఆదాయం 5.4 మిలియన్ యెన్లు ఉండాలనే నిబంధనను ప్రభుత్వం పెట్టింది. కాగా, గతేడాది జపాన్‌లో 8.65 లక్షల మంది జన్మిస్తే.. 13 లక్షల మందికి పైగా చనిపోయిన సంగతి తెలిసిందే.

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..