Breaking News
  • హథ్రాస్‌ రేప్‌ కేసులో ట్విస్ట్‌: యూపీ: హథ్రాస్‌ ఘటనపై ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ సంచలనం. యువతిపై అత్యాచారం జరగలేదంటున్న యూపీ పోలీసులు. అత్యాచారం జరిగినట్టు ఎలాంటి ఆనవాళ్లు లభ్యంకాలేదు-ఏడీజీ. సున్నితభాగాలపై ఎలాంటి గాయాలు లేవని ఎఫ్‌సీఎల్‌ రిపోర్ట్‌. అత్యాచార బాధితురాలి శరీరంపై స్పెర్మ్‌ మరకలు లేవన్న ఎఫ్‌సీఎల్‌ రిపోర్ట్‌. నాలుక కోశారనడం కూడా అవాస్తవమే-యూపీ ఏడీజీ ప్రశాంత్‌కుమార్‌. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు గ్యాంగ్‌రేప్‌గా చిత్రీకరించారని పోలీసుల అనుమానాలు. మెడకు తీవ్రగాయం కావటంతోనే బాధితురాలు మృతిచెందినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌.
  • తిరుమల: నవరాత్రి బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశం. నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయం వెలుపల నిర్వహించాలని నిర్ణయించిన టీటీడీ. అక్టోబర్ 16 నుండి 24 వరకు తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు. వాహనసేవలను యథావిధిగా మాడవీధుల్లో ఊరేగించాలని నిర్ణయించిన టీటీడీ. బ్రహ్మోత్సవ రోజుల్లో దర్శనాల సంఖ్యను కూడా పెంచే యోచనలో టీటీడీ. దర్శన టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించాలని నిర్ణయం. దర్శనాల సంఖ్యను 20వేల వరకు పెంచే అవకాశం. మాడవీధుల్లోని గ్యాలరీల్లో థర్మల్ స్క్రీనింగ్ తో పాటు ఫుట్ ఆపరేటడ్ శానిటైజర్లు ఏర్పాటు.
  • పవన్ కళ్యాణ్: అక్టోబర్ 2.. మహాత్ముడు ఉదయించిన రోజు. భారతీయులంతా పండుగలా భావించే రోజు. 'నా జీవితమే.. నా సందేశం' అని భాషణమొనర్చిన మోహన్ చంద్ కరంచంద్ గాంధీజీ జీవితం- కేవలం భారతీయులకే కాక యావత్ ప్రపంచానికే ఒక గొప్ప జీవన మార్గం. ఒక సాధారణ వ్యక్తి బాపుగా ప్రజల గుండెల్లో ఎలా గూడు కట్టుకున్నాడు..? ఒక మామూలు మానవుడు మహాత్ముడుగా ఎలా కొనియాడబడ్డాడు...? కొల్లాయి వస్త్రాలు ధరించే ఒక సగటు మనిషి బ్రిటిష్ సామ్రాజ్యపు దాస్యశృంఖలాలను ఎలా పటాపంచలు చేశాడు...? అనే గాంధీజీ జీవితంలోని ఘట్టాలు నేటి యువతకు పాఠాలులాంటివి. దేశ సమైక్యత కోసం ప్రాణాలు ధారపోసి జాతిపితగా ఖ్యాతి పొందారు.
  • చెన్నై : చెన్నై విమానాశ్రయం లో భారీగా పట్టుబడ్డ బంగారం . దుబాయ్ నుండి చెన్నై కి అక్రమంగా బంగారం రవాణా ని గుర్తించిన అధికారులు . పట్టుబడ్డ 2.82 కిలోల బంగారం విలువ ఒక కోటి 40 లక్షలు . బంగారాన్ని బండిల్స్ రూపం లో తరలిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు .
  • ముమైత్ ఖాన్ సినీ నటి: రెండు రోజుల నుంచి నా పై జరుగుతున్న తప్పుడు ఆరోపణలపై ఫిర్యాదు ఇచ్చాను. నాకు క్యాబ్ డ్రైవర్ ను‌ చీట్ చేయాల్సిన అవసరం ఏంటి. కొన్ని మీడియా చానళ్లు నా పరువుకి భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశారు. నా క్యారెక్టర్ ను‌ జడ్జ్ చేసే అధికారం ఏముంది ఒక్కసారి ఆలోచించండి. నామీద డ్రైవర్ తప్పుడు ఆరోపణలు చేశాడు. అతను చెప్పిన దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. అతను రాష్ డ్రైవింగ్ చేసి నన్ను భయాందోళనకు గురి చేశాడు. అతనిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ పోలీసులకు అందజేశాను. అతనికి 23 వేలు 500 డబ్బులు చెల్లించాను. మీడియా ఒక్క సైడ్ వర్షన్ తీసుకొని వార్తలు వేయడం నన్ను బాధించింది. నేను 12 సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను నా క్యారెక్టర్ గురుంచి అందరికీ తెలుసు. టోల్ గేట్ లకు సంబంధించి పూర్తి డబ్బులు నేనే కట్టాను.
  • GHMC స్టాండింగ్ క‌మిటీ స‌మావేశంలో 8 అంశాలకు ఆమోదం : మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌. రూ. 298 కోట్ల‌తో నాలాల ప‌నులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపిన GHMC . ఇక రోడ్ల‌పై చెత్త వేస్తే ఎన్ ఫోర్స్ మెంట్ ద్వారా జ‌రిమానాలు . సెంట్ర‌ల్ మీడియన్స్‌, ట్రాఫిక్ ఐలాండ్ నిర్వ‌హ‌ణ‌ సి.ఎస్‌.ఆర్ కు అప్ప‌గించడానికి విధి విధానాలు. పనిచేయలేకపోతున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రీప్లేస్‌మెంట్ కు ఆమోదం. ప్రతి 100 మీట‌ర్ల దూర‌ంలో రెండు చెత్త బుట్ట‌లు ఏర్పాటు . ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ప్రైవేటు ఏజెన్సీల‌కు శానిటేష‌న్ విధులు.

ఏపీలోని ఈ ఐదు జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. టెస్టులు పెంచే కొద్దీ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.

Highest Number Of Corona Positive Cases AP, ఏపీలోని ఈ ఐదు జిల్లాల్లో అత్యధిక కరోనా కేసులు..

Highest Number Of Corona Positive Cases AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. టెస్టులు పెంచే కొద్దీ అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అటు ఏపీ ప్ర‌భుత్వం కూడా క‌రోనా క‌ట్ట‌డికి ఎన్నో ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. ఇక ఇప్ప‌టికే ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధులు కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 5,83,925కి చేరుకుంది. అందులో యాక్టివ్ కేసులు 92,353 ఉండ‌గా, 5041 మంది వైరస్ కారణంగా మ‌ర‌ణించారు. ఇదిలా ఉంటే కరోనా కేసులతో పాటు రికవరీ రేటు కూడా క్రమక్రమంగా పెరుగుతుండటం ప్రజలకు కాస్త ఊరటను ఇచ్చే అంశం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 4,86,531 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా ప్ర‌స్తుతం ఏపీలోని క‌ర్నూలు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావ‌రి, అనంతపురం, చిత్తూరు.. ఈ ఐదు జిల్లాల్లో కోవిడ్ పాజిటివ్‌ కేసులు అధికంగా ఉన్నాయి. అంతేకాదు ఈ జిల్లాల్లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇక ఏపీలో అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో తూర్పు గోదావరి జిల్లా టాప్‌లో ఉంది. ఈస్ట్ గోదావ‌రిలో క‌రోనా కేసుల సంఖ్య ఏకంగా 80 వేలకు చేరువైంది. ప్ర‌స్తుతం అక్క‌డ 79,643 క‌రోనా కేసులు ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కూ 464 మంది కోవిడ్ బారిన ప‌డి మ‌ర‌ణించారు. నిన్న ఒక్క రోజే అక్కడ 1423 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ జిల్లాలో 11,999 యాక్టీవ్ కేసులు ఉండ‌గా, 67,180 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక పశ్చిమ గోదావరిలో 52,520 కోవిడ్ కేసులు రిజిస్ట‌ర్ కాగా, ఇప్ప‌టివ‌ర‌కూ అక్క‌డ 396 మంది చ‌నిపోయారు. అలాగే క‌ర్నూలులో 52,280 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, చిత్తూరులో 50,718 పాజిటివ్ కేసులు, అనంతపురంలో 50,088 కేసులు బయటపడ్డాయి. ఇక ఏపీలో అత్యధిక కరోనా మరణాలు చిత్తూరు జిల్లాలో సంభవించాయి. అక్కడ కోవిడ్ కారణంగా 543 మంది మ‌ర‌ణించారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించినా నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా వెళ్లి టెస్టులు చేయించుకోవాల‌ని పేర్కొంటున్నారు. అలాగే వేడి ఆహారం, గోరువెచ్చ‌టి నీరు తాగాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

Related Tags