‘అది అబధ్ధం.. కరోనా వైరస్ మా సృష్టి కాదు’…. వూహాన్ ల్యాబ్ డైరెక్టర్

కరోనా వైరస్ చైనాలోని వూహాన్ లో గల ల్యాబ్ నుంచి పుట్టిందన్న అమెరికా ఆరోపణలను ఈ ల్యాబ్ డైరెక్టర్ ఖండించారు. ‘అది అసాధ్యం’ అని వ్యాఖ్యానించారు. హై సెక్యూరిటీతో  బయో సేఫ్టీ లేబొరేటరీ అయిన ఈ వైరాలజీ ఇన్స్ టి ట్యూట్ నుంచి ఈ వైరస్ పుట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదేపనిగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే.. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఆయనతో బాటు విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా తెలిపారు. కానీ […]

'అది అబధ్ధం.. కరోనా వైరస్ మా సృష్టి కాదు'.... వూహాన్ ల్యాబ్ డైరెక్టర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 19, 2020 | 4:24 PM

కరోనా వైరస్ చైనాలోని వూహాన్ లో గల ల్యాబ్ నుంచి పుట్టిందన్న అమెరికా ఆరోపణలను ఈ ల్యాబ్ డైరెక్టర్ ఖండించారు. ‘అది అసాధ్యం’ అని వ్యాఖ్యానించారు. హై సెక్యూరిటీతో  బయో సేఫ్టీ లేబొరేటరీ అయిన ఈ వైరాలజీ ఇన్స్ టి ట్యూట్ నుంచి ఈ వైరస్ పుట్టిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదేపనిగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే.. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఆయనతో బాటు విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా తెలిపారు. కానీ చైనా శాస్త్రజ్ఞులు మాత్రం ఇది వూహాన్ మార్కెట్లో క్రూర జంతువుల నుంచి మానవులకు వ్యాపించి ఉండవచ్ఛునంటున్నారు. ఏమైనా… ఈ వైరాలజీ ఇన్స్ టి ట్యూట్  లో గల పీ-4  ల్యాబ్ లో వైరస్ పుట్టి ఉండవచ్ఛునని, ఇది కుట్రలో ఓ భాగం కావడానికి అవకాశం ఉందన్న ఊహాగానాలు మరింతగా బలోపేతమవుతున్నాయి. అతి ప్రమాదకరమైన సుమారు 1500 రకాల వైరస్ ల పై ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా… ఈ ఊహాగానాలు, ఆరోపణలను ల్యాబ్ డైరెక్టర్ యువాన్ జిమింగ్ ఖండిస్తూ.. ‘ మా నుంచి ఈ వైరస్ వచ్చిందనడానికి అవకాశమేలేదు’ అని స్పష్టం చేశారు. తమ స్టాఫ్ లో ఎవరికీ ఇన్ఫెక్షన్స్ సోకలేదని, కరోనా వైరస్ కు సంబంధించిన వివిధ అంశాలపై తమ సంస్థ సిబ్బంది అంతా పరిశోధనలు చేస్తున్నారని ఆయన చెప్పారు. అసలు దీని సమాచారమంతా తాము జనవరి మొదటివారంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేశామన్నారు. కొన్ని మీడియా సంస్థలు కావాలనే ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని జిమింగ్ ఆరోపించారు. పీ-4 ల్యాబ్ మా సంస్థలో ఉంది గనుక ఇలాంటి ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయని మండిపడ్డారు.