Tirupati Maternity Hospital: బిడ్డను మాయం చేశారంటూ బాధితులు.. అసలు కడుపులో బిడ్డే లేదంటూ వైద్యులు.. తిరుపతి ఆస్పత్రిలో ట్విస్ట్..

Tirupati Government Maternity Hospital: తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తన బిడ్డను మాయం చేశారని బాధిత మహిళ ఆరోపిస్తుండగా..

Tirupati Maternity Hospital: బిడ్డను మాయం చేశారంటూ బాధితులు.. అసలు కడుపులో బిడ్డే లేదంటూ వైద్యులు.. తిరుపతి ఆస్పత్రిలో ట్విస్ట్..
Follow us

|

Updated on: Jan 17, 2021 | 2:44 PM

Tirupati Government Maternity Hospital: తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తన బిడ్డను మాయం చేశారని బాధిత మహిళ ఆరోపిస్తుండగా.. అసలు కడుపులో బిడ్డే లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. వివరాల్లోకెళితే.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మంగ నెల్లూరు గ్రామానికి చెందిన శశికళ నిండు గర్భిణి. దాంతో రెండు రోజుల క్రితం శశికళ తిరుపతి ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో చేరింది. శనివారం నాడు డెలివరీ డేట్ ఇచ్చి, ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు వైద్యులు. ఆమెకు కాన్పు కూడా చేశారు. తీరా చూస్తే బిడ్డ మాయం అయ్యింది. దీనిపై శశికళ, ఆమె కుటుంబీకులు ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. ఆక్రమంలో బాధితులు, ఆస్పత్రి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ బిడ్డను మాయం చేసి తీరా తమపై దాడి చేశారని శశికళ, ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు.

అయితే శశికళ కడుపులో అసలు బిడ్డే లేదని, వైద్యులను మోసం చేస్తున్నారంటూ శశికళను, ఆమె భర్తను ఆస్పత్రివర్గాలు పోలీసులకు అప్పగించారు. గర్భవతి శశికళకు తొమ్మిది నెలలు నిండాయని, గ్రామంలో పెద్ద ఎత్తున శ్రీమంతం కూడా జరిపామని కుటుంబీకులు చెబుతున్నారు. శశికళ శ్రీమంతానికి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె బంధువులు చూపించారు. దాంతో శశికళ డెలివరీ వ్యవహారం ట్విస్ట్‌గా మారింది. మరోవైపు తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు.. ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. అసలు శశికళ గర్భం దాల్చిందా? లేదా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మరోవైపు శశికళకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి.

Also read:

త్రిపుర కాంగ్రెస్ చీఫ్ బిశ్వాస్ కారుపై దాడి, ఘటనలో స్వల్ప గాయాలు, బీజేపీ కార్యర్తల పనేనని ఆరోపణ

ప్రపంచ కరోనా అప్‌డేట్.. .. ఒక్క రోజులో 6,45,901 పాజిటివ్ కేసులు, 13,070 మరణాలు..!