8ఏళ్ళుగా అమెరికాలో తెలుగు హవా.. ఇప్పుడేమైంది మరి ?

అమెరికాలో మనోళ్ళు.. అదే మన తెలుగోళ్ళు అదరగొట్టేస్తున్నారు. అందుకే తెగ విస్తరిస్తున్నారు. గత ఎనిమిదేళ్ళ కాలంలో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మరే ఇతర భారతీయ భాష మాట్లాడే వారు తెలుగు మాట్లాడే వారితో పోటీ పడి సంఖ్యను పెంచుకోవడం లేదనే చెప్పాలి. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో హిందీ మాట్లాడే వారి సంఖ్యే ఇప్పటికీ అత్యధికంగా వుంది. కానీ.. రాపిడ్‌గా పెరుగుతున్న భాషల్లో తెలుగు వుండడం విశేషం. ప్రస్తుతం అత్యధికంగా హిందీ మాట్లాడే […]

8ఏళ్ళుగా అమెరికాలో తెలుగు హవా.. ఇప్పుడేమైంది మరి ?
Follow us

|

Updated on: Nov 01, 2019 | 12:46 PM

అమెరికాలో మనోళ్ళు.. అదే మన తెలుగోళ్ళు అదరగొట్టేస్తున్నారు. అందుకే తెగ విస్తరిస్తున్నారు. గత ఎనిమిదేళ్ళ కాలంలో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మరే ఇతర భారతీయ భాష మాట్లాడే వారు తెలుగు మాట్లాడే వారితో పోటీ పడి సంఖ్యను పెంచుకోవడం లేదనే చెప్పాలి. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో హిందీ మాట్లాడే వారి సంఖ్యే ఇప్పటికీ అత్యధికంగా వుంది. కానీ.. రాపిడ్‌గా పెరుగుతున్న భాషల్లో తెలుగు వుండడం విశేషం.
ప్రస్తుతం అత్యధికంగా హిందీ మాట్లాడే భారతీయులుండగా.. వారి తర్వాత గుజరాతీ ఆ తర్వాత మూడో స్థానంలో తెలుగు మాట్లాడే వారి జనాభా వుంది. అమెరికన్ కమ్యూనిటీ సర్వే ఇటీవల రిలీజ్ చేసిన వివరాల ప్రకారం 2010-2018 మధ్య కాలంలో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2010లో అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 2 లక్షల 23 వేల మంది వుండగా.. 2018 నాటికి అది 4 లక్షలకు చేరుకుంది. అంటే 79.5 శాతం అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఏనిమిదేళ్ళ కాలంలో పెరిగిందన్నమాట.
అమెరికన్ కమ్యూనిటీ సర్వే విడుదల చేసిన సంఖ్యలను చూస్తే.. జులై 1, 2018 నాటికి అమెరికాలో 8 లక్షల 74 వేల మంది హిందీ మాట్లాడే వారున్నారు. 2017తో పోలిస్తే ఈ సంఖ్య 1.3 శాతం పెరిగింది. 2010-2018 మధ్యకాలంతో పోలిస్తే. హిందీ మాట్లాడే వారు 43.5 శాతం పెరిగారు. అదే సమయంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 79.5 శాతం పెరిగింది 2010-2018 మధ్య ఎనిమిదేళ్ళ మధ్యకాలంలో.  అమెరికాలో జన్మించిన వారితోపాటు లీగల్, ఇల్లీగల్ ఇమ్మిగ్రేంట్స్‌ని ఈ సర్వేలో పరిగణలోకి తీసుకున్నట్లు సర్వే వివరాలను వెల్లడించిన యుఎస్ సెన్సెస్ బ్యూరో తెలిపింది.
ఇదే కాలంలో బెంగాలీ మాట్లాడే వారి సంఖ్య 68 శాతం పెరిగి 3 లక్షల 75 వేలకు, తమిళం మాట్లాడే వారి సంఖ్య 67.5 శాతం పెరిగి 3 లక్షల 8వేలకు చేరుకున్నట్లు వెల్లడించారు. అయితే బెంగాలీ, తమిళం మాట్లాడే వారంతా భారతీయులు కారని సర్వే వివరాల్లో పొందుపరిచారు. ఎందుకంటే బెంగాలీ మాట్లాడేవారిలో బంగ్లాదేశీయులు, తమిళం మాట్లాడే వారిలో శ్రీలంక, మలేషియా, సింగపూర్ జాతీయులు కూడా వున్నారని తెలిపారు.
2010తో పోలిస్తే.. తెలుగు, గుజరాతీ మాట్లాడే వారి సంఖ్య గణనీయంగా పెరగగా.. గత రెండేళ్ళలో అంటే 2017-18 మధ్యకాలంలో మాత్రం తెలుగు మాట్లాడే వారి సంఖ్య స్వల్పంగా తగ్గినట్లు నివేదికలో వెల్లడైంది. 2017లో 4 లక్షల 15 వేలుగా వున్న తెలుగు మాట్లాడే వారి సంఖ్య జులై 1, 2018న మాత్రం 4 లక్షలకే పరిమితమైంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మారిన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, అక్రమంగా నివసిస్తున్న వారిని తిప్పి పంపడం వంటి అంశాలు గత రెండేళ్ళలో తెలుగువారి సంఖ్య తగ్గడానికి కారణాలని భావిస్తున్నారు.

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..