YS Vijayamma : వైఎస్‌ షర్మిల తెలంగాణ కొత్త పార్టీకి విజయమ్మ వెన్నుదన్ను, తల్లి సెంట్రిక్‌ గానే ఖమ్మం సంకల్ప సభ.! ఇదే రూట్ మ్యాప్

|

Apr 07, 2021 | 4:28 PM

YS Sharmila sankalpa sabha Khammam : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు వైఎస్ షర్మిల ఉర్రూతలూగుతున్నారు...

YS Vijayamma : వైఎస్‌ షర్మిల తెలంగాణ కొత్త పార్టీకి విజయమ్మ వెన్నుదన్ను, తల్లి సెంట్రిక్‌ గానే ఖమ్మం సంకల్ప సభ.! ఇదే రూట్ మ్యాప్
Follow us on

YS Sharmila sankalpa sabha Khammam : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు వైఎస్ షర్మిల ఉర్రూతలూగుతున్నారు. ఖమ్మంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన సంకల్ప సభకి చకచకా ఏర్పాట్లు చేయిస్తున్నారు. అయితే, ఈ సభకు షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ కూడా హాజరుకాబోతుండటం విశేషం. ఈ మేరకు షర్మిల అనుచరుడు పిట్టా రాం రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు, సంకల్ప సభకి సంబంధించి రూట్ మ్యాప్ కూడా ఆయన ప్రకటించారు. తన బిడ్డ షర్మిలకు ఆశీస్సులు ఇవ్వడానికే విజయమ్మ వస్తున్నారని ఆయన చెప్పారు. ఎల్లుండి అనగా 9వ తేదీన నిర్వహిస్తోన్న సంకల్ప సభకు కోవిడ్ నిబంధనలు పాటిస్తామని ఆయన తెలిపారు.

ఖమ్మంలో బహిరంగ సభకు సాయంత్రం 5 గంటలకు అనుమతి ఇచ్చారని, తెలంగాణ ప్రజలకు అందరూ తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన అభ్యర్థించారు. తెలంగాణ హక్కులు సాధించేందుకు షర్మిల ముందుకు వస్తోంది.. అపోహలు వద్దు అని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికలకు సభలు నిర్వహిస్తున్నారు.. ఆయా సభల విషయంలో పాలకులకు ఎలాంటి రూల్స్ వర్తిస్తాయా తమకు కూడా సభకు సంబంధించి అవే రూల్స్ వర్తిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

షర్మిల కోసం తెలంగాణ ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పిన పిట్టా, ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌ బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ నుంచి బయలుదేరి, కోటి.. దిల్ సుఖ్ నగర్.. ఎల్బీ నగర్.. lpt మార్కెట్.. హయత్ నగర్.. చౌటుప్పల్.. నకిరేకల్.. సూర్యాపేట.. చివ్వేంల మీదుగా షర్మిల ఖమ్మం చేరుకుంటారని ఆయన రూట్‌ మ్యాప్‌ వెల్లడించారు. ఇవే కాకుండా పలువురు గ్రామస్తులు తమ, తమ గ్రామాల దగ్గర ఆగాలని కోరుతున్నారని వీలునిబట్టి షర్మిల ఆయా గ్రామాల్లో ఆగుతారని చెప్పారు. కోదాడ, నుంచి పాలేరు కు గం. 3.30 కు షర్మిల చేరుకుంటారని, పెద్ద తండాలో వైస్సార్ విగ్రహం నుంచి ర్యాలీగా పెవిలియన్ గ్రౌండ్ కి షర్మిల చేరుకుంటారని పిట్టా రాంరెడ్డి స్పష్టం చేశారు.

Read also :  NV Ramana : తెలుగు తేజానికి అగ్రాసనం.. దేశన్యాయవ్యవస్థలో అత్యున్నత పదవి, జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ ప్రస్థానం