Telangana: ఎస్‌ఐ పరీక్ష సరిగా రాయలేదని ప్రాణాలు తీసుకుంది.. ఇంటికి వెళుతూ చెరువులోకి దూకి..

పంచశీల డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉంటోంది. మూడు రోజుల క్రితం నిర్వహించిన ఎస్సై ప్రాథమిక పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది.

Telangana: ఎస్‌ఐ పరీక్ష సరిగా రాయలేదని ప్రాణాలు తీసుకుంది.. ఇంటికి వెళుతూ చెరువులోకి దూకి..
Telangana
Follow us

|

Updated on: Aug 10, 2022 | 9:21 AM

Telangana Crime News: చిన్న చిన్న కారణాలతో కొంతమంది విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా.. ఓ యువతి పరీక్ష సరిగా రాయలేదన్న కారణంతో బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష సరిగా రాయలేదని యువతి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జల్లాలోని భిక్కనూర్ మండలం జంగంపల్లిలో చోటుచేసుకుంది. పంచశీల (20) అనే యువతి గ్రామంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పంచశీల డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉంటోంది. మూడు రోజుల క్రితం నిర్వహించిన ఎస్సై ప్రాథమిక పరీక్ష సరిగా రాయలేదని మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాదు నుంచి కామారెడ్డి వైపు వెళ్తూ పంచశీల మార్గ మధ్యలో జంగంపల్లి గ్రామ స్టేజి వద్ద దిగి ప్రాణాలు తీసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతురాలు.. మద్నూర్ మండలం కోరేగావ్ గ్రామానికి చెందిన పంచశీలగా గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భిక్కనూర్ పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..