కౌన్‌ బనేగా తెలంగాణ సీఎం..? తర్జనభర్జనలో ప్రధాన పార్టీలు.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే..!

ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణకు సీఎం ఎవరు? ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. హ్యాట్రిక్‌ కొట్టి కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని BRS చెబుతుంటే..తమ పార్టీ అభ్యర్థే సీఎం కాబోతున్నారని కాంగ్రెస్‌ అంటోంది. అటు బీసీ వ్యక్తినే సీఎం అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇంతకీ.. కౌన్‌ బనేగా తెలంగాణ సీఎం..?

కౌన్‌ బనేగా తెలంగాణ సీఎం..? తర్జనభర్జనలో ప్రధాన పార్టీలు.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే..!
Brs, Bjp, Congress Party

Updated on: Nov 06, 2023 | 9:19 PM

ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణకు సీఎం ఎవరు? ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. హ్యాట్రిక్‌ కొట్టి కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని BRS చెబుతుంటే..తమ పార్టీ అభ్యర్థే సీఎం కాబోతున్నారని కాంగ్రెస్‌ అంటోంది. అటు బీసీ వ్యక్తినే సీఎం అంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇంతకీ.. కౌన్‌ బనేగా తెలంగాణ సీఎం..?

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో బంపర్‌ మెజార్టీతో గెలిచి..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అధికార బీఆర్ఎస్‌ పార్టీ అంటోంది. అంతేకాదు సౌతిండియాలోనే కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎంగా రికార్డు సృష్టించబోతున్నారని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఇక ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్‌ పార్టీలో పోటాపోటీ ఉంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే తామే సీఎం అంటూ పలువురు నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా ఆ పార్టీ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కూడా సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌ బిడ్డలకు రాష్ట్ర నాయకత్వం దక్కబోతోందన్నారు.

కాంగ్రెస్‌ గెలిచాక సీఎం ఎవరు అనేది సోనియాగాంధీ, రాహుల్‌, ఖర్గే నిర్ణయిస్తారన్నారు జగ్గారెడ్డి. ముఖ్యమంత్రి పదవిపై ఇప్పుడు ఎవరు మాట్లాడకపోతేనే మంచిదన్నారు. మరోవైపు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని కమలంపార్టీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలోనూ అదే చెబుతోంది. అటు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై ఈటల రాజేందర్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశారు. రాష్ట్రంలో హంగ్‌వస్తే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. బీఆర్‌ఎస్‌-బీజేపీ ఒక్కటేనన్న విమర్శలను కొట్టిపారేశారు.

బీసీలకు బీజేపీ 50 శాతం సీట్లు ఇవ్వడంతోపాటు బీసీ సీఎంను ప్రకటించిందన్నారు బండి సంజయ్‌. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు బీసీలను అవమానపర్చేలా వ్యవహరిస్తున్నాయని ఫైరయ్యారు. మొత్తానికి మరి కొద్దిరోజుల వ్యవధిలో సీఎం ఎవరనేది ఓటర్లు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎవరు అధికారాన్ని చేపట్టి సీఎం అవ్వనున్నారనేది తేలిపోనుంది. అంతవరకూ వేచి చూడాలి.