Rain Alert: వచ్చే 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీచేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలిపోయింది.

Rain Alert: వచ్చే 3 రోజులు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Telangana Rains

Updated on: Oct 12, 2025 | 4:32 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీచేసింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. శనివారం దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతానికి తరలిపోయింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రం నుండి తిరోగమనానికి రాగల రెండు, మూడు రోజుల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు.. ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు:

ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మంగళవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఆదివారం, సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 30 నుండి 40 కి.మీ వేగంతో కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఆదివారం జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉంది..

సోమవారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. మంగళవారం కూడా తెలంగాణ అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..