ఎద్దుకు అంతిమ సంస్కారాలు.. బోరున ఏడ్చిన రైతు

అన్నదాతకు కన్నీళ్లు మిగిలిచ్చింది ఓ దుక్కిటెడ్డు. ఎద్దు పాముకాటుకు గురై మరణించింది. దీంతో రైతు బోరున విలపిస్తున్నాడు. వరంగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పశువైద్య సిబ్బంది బ్రతికించాలని ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు చూస్తే..

ఎద్దుకు అంతిమ సంస్కారాలు.. బోరున ఏడ్చిన రైతు
Warangal

Edited By:

Updated on: Aug 22, 2026 | 2:20 PM

అన్నదాతకు దుక్కిటెడ్డే కుడి భుజం.. ఆ ఎద్దుతో అరకకట్టి నాగలిదున్నితేనే నాలుగు మెతుకులు నోటిలోకి పోతాయి. వరంగల్ జిల్లాలో ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో దుక్కిటెడ్డు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయింది.. పాముకాటుకు గురైన ఎద్దు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో ఆ రైతు బోరున విలపించాడు..మృతి చెందిన ఎద్దుకు అంతిమ సంస్కారాల నిర్వహించారు. ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం శివాజీనగర్ గ్రామంలో జరిగింది. సంజీవ్ అనే రైతు తన పొలంలో వ్యవసాయ పనులు నిమగ్నం అయ్యాడు. తన జోడెడ్డులను పొలం వద్దే కట్టేశాడు. అదే సమయంలో తన దుక్కిటేద్దును పాము కాటేసింది. పాము కాటేసి పరుగులు పెడుతున్న దృశ్యాలు గమనించిన ఆ రైతు.. వెంటనే పశువైద్య సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వైద్య సేవలు అందించెలోపే ప్రాణాలు కోల్పోయింది. దుక్కిటేద్దు ప్రాణాలు కోల్పోవడంతో రైతు సంజీవ్ బోరుణ విలపించాడు. మృతిచెందిన ఆ ఎద్దును ఖననంచేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు..

Loading...
Unable to load recommendations.
Follow Us