Telangana: పొద్దున్నే షాప్ తెరిచేందుకు వెళ్లిన వ్యాపారి.. బాక్స్‌ ఓపెన్ చేయగా.. వామ్మో..

రోజులాగే ఉదయం షాప్‌ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓ వ్యాపారికి ఊహించని పరిణామం ఎదురైంది. తన తోపుడు బండిపై పండ్లు పేరుస్తుండా బండి కింద నుంచి ఏవో శబ్ధాలు రావడంతో ఏంటని చూడగా ఓ భారీ పాము అతనికి దర్శనమిచ్చింది. అది చూసిన ఆ వ్యాపారి భయంతో వెనక్కి జరిగి స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పాములు పట్టేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Telangana: పొద్దున్నే షాప్ తెరిచేందుకు వెళ్లిన వ్యాపారి.. బాక్స్‌ ఓపెన్ చేయగా.. వామ్మో..
Snake In Fruit Stall Jagtial

Edited By:

Updated on: Jun 25, 2026 | 2:50 PM

రోజులాగే ఉదయం షాప్‌ ఓపెన్ చేసేందుకు వెళ్లిన ఓ వ్యాపారికి ఊహించని పరిణామం ఎదురైంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చాలా మంది తోపుడు బండ్లపై పూలు, పండ్లు, కూరగాయలు అమ్ముతుంటారు. ఇక్కడే పండ్ల దుకాణం నడిపే అజీమ్ ఖాన్ అనే వ్యాపారి, రోజూలాగే ఉదయం షాప్ ఓపెన్ చేసేందుకు వచ్చాడు. డబ్బాలోని పండ్లను తీసి బండిపై సర్దుతుండగా.. బండి కింద నుంచి ‘బుస్ బుస్’ మంటూ శబ్దాలు వినిపించాయి.

దీంతో అనుమానం వచ్చిన అజీమ్ ఖాన్ పక్కనే ఉన్న తోటి వ్యాపారులను పిలిచాడు. అందరూ కలిసి శబ్దం వస్తున్న డబ్బాను తెరిచి చూడగా.. అందులో ఓ భారీ సర్పం కనిపించింది. దాన్ని చూసి వ్యాపారితో పాటు చుట్టుపక్కల వారు ఒక్కసారిగా ప్రాణభయంతో వెనక్కి పరుగులు తీశారు. కొందరు ధైర్యం చేసి పాము తోక పట్టి లాగే ప్రయత్నం చేసినప్పటికీ అది దొరకలేదు.

వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ సుమారు అరగంట పాటు శ్రమించి ఎట్టకేలకు ఆ భారీ పామును బంధించాడు. దీంతో వ్యాపారులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అక్కడ ఉన్న కొందరు ఈ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us