Cow Baby shower: గోమాతకు వేదమంత్రాలతో వైభవంగా సీమంతం.. అతిధులకు విందు భోజనం..

తమ పెంపుడు జంతువులకు బర్త్ డేలు, వివాహాలు, సీమంతాలు కూడా ఘనంగా చేస్తుంటారు.  వైశాఖ పూర్ణిమ మంచిరోజుగా భావించి..ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులు బంధుమిత్రుల సమక్షంలో ఆవుకు ఘనంగా సీమంతం వేడుక నిర్వహించారు.

Cow Baby shower: గోమాతకు వేదమంత్రాలతో వైభవంగా సీమంతం.. అతిధులకు విందు భోజనం..
Cow Baby Shower

Updated on: May 05, 2023 | 10:47 AM

కొందరు తమ పెంపుడు జంతువుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగానే భావిస్తారు. తమతో పాటు.. వాటికి కూడా సకల సౌకర్యాలు సమకూరుస్తారు. తమ పెంపుడు జంతువులకు బర్త్ డేలు, వివాహాలు, సీమంతాలు కూడా ఘనంగా చేస్తుంటారు.  వైశాఖ పూర్ణిమ మంచిరోజుగా భావించి..ఖమ్మం జిల్లాకు చెందిన దంపతులు బంధుమిత్రుల సమక్షంలో ఆవుకు ఘనంగా సీమంతం వేడుక నిర్వహించారు.

తాజాగా ఖమ్మంజిల్లా చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన మట్టా రవి అనే రైతు తన ఇంటి గోవుకు ఘనంగా సీమంతం వేడుక జరిపించారు. ఇంటి ఆడబిడ్డకు ఏవిధంగా సంప్రదాయబద్ధంగా సీమంతం చేస్తారో అంతే సంప్రదాయంగా సీమంతం జరిపించారు. చుట్టుపక్కల ముత్తయిదువలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సకలదేవతా స్వరూపమైన గోమాతకు మంగళ స్నానం చేయించి.. అనంతరం పూలు, పండ్లు, బొట్లు పెడుతూ.. దానికి నచ్చిన ఆహారాన్ని తినిపించారు. పండితుల సమక్షంలో మంగళహారతులు ఇచ్చి సీమంతం వేడుక జరిపించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన బంధుమిత్రులకు ఘనంగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us