గోమాతకు అరుదైన సంస్కారం.. పండుగలా జరుపుకుంటున్న స్థానికులు..

గోమాతను పెంచడంమే కాదు దానికి నామకరణం ఓ పండుగలా చేసి గోమాతపై వారికి ఎంతో ప్రేమ ఉందొ నిరూపించుకున్నారు సిద్దిపేట ప్రజలు. గోమాత రక్షణ, సేవ, పూజ అత్యంత పుణ్యప్రదమని, భారతీయ పురాణ ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. ఆవులో సకల దేవతలూ కొలువై ఉంటారని పెద్దలు చెబుతారు. గోమాత మహిమ ఇంతా అంతా కాదు.‘రామాయణం’లో కామధేనువును విశ్వామిత్రుడు బలవంతంగా వశిష్ట మహర్షినుండి తీసుకుపోవటం, తత్పర్యవసానాలు, ‘భాగవతం’లో శ్రీకృష్ణుడు గోవులపట్ల ప్రకటించిన అవ్యాజమైన ప్రేమ.. వంటివెన్నో ఇందుకు తార్కాణాలు.

గోమాతకు అరుదైన సంస్కారం.. పండుగలా జరుపుకుంటున్న స్థానికులు..
Cow

Edited By:

Updated on: Jun 08, 2024 | 8:22 AM

గోమాతను పెంచడంమే కాదు దానికి నామకరణం ఓ పండుగలా చేసి గోమాతపై వారికి ఎంతో ప్రేమ ఉందొ నిరూపించుకున్నారు సిద్దిపేట ప్రజలు. గోమాత రక్షణ, సేవ, పూజ అత్యంత పుణ్యప్రదమని, భారతీయ పురాణ ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి. ఆవులో సకల దేవతలూ కొలువై ఉంటారని పెద్దలు చెబుతారు. గోమాత మహిమ ఇంతా అంతా కాదు.‘రామాయణం’లో కామధేనువును విశ్వామిత్రుడు బలవంతంగా వశిష్ట మహర్షినుండి తీసుకుపోవటం, తత్పర్యవసానాలు, ‘భాగవతం’లో శ్రీకృష్ణుడు గోవులపట్ల ప్రకటించిన అవ్యాజమైన ప్రేమ.. వంటివెన్నో ఇందుకు తార్కాణాలు. నేటికీ వివాహతంతులో భాగంగా కన్యాదానంతోపాటు గోదానమూ ప్రశస్తమని పురాణాలు చెబుతున్నాయి. జనన మరణాలు, పట్టాభిషేకాలు, ఉత్సవాల వేళల్లో ‘గోదానం’ ఒక గొప్ప సందేశం. ఎన్నో ఔషధగుణాలతో సంపూర్ణ ఆరోగ్యానికి పుష్టినిచ్చేవిగాను పలు పరిశోధనల్లో ఇవి విశేషమైన గుర్తింపును పొందాయి.

గోమాతను రక్షిస్తే భూమాత మనల్ని రక్షిస్తుందని నమ్ముతారు చాలా మంది. గోమాతలో 33 కోట్ల దేవతలు నిక్షిప్తమై ఉంటారని ఒక గోవుకు పూజ చేస్తే 33 కోట్ల మంది దేవతలకు పూజ చేసినట్లేనని, ఐదు గ్రహాలు కలిసే ఈ రోజున గోమాతకు పూజలు చేయడం తమ పూర్వజన్మ సుకృతమని వారు తెలిపారు. ప్రజలు ఇళ్లల్లో అపార్ట్మెంట్లలో కుక్కలను పెంచడం మాని గోమాతను పెంచాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రావి చెట్టు హనుమాన్ దేవాలయ గోశాలలో పుంగనూరు గోమాతకు నామకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోమాతకు తొట్లే కార్యక్రమం నిర్వహించి రాధమ్మ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల పాల్గొని గోమాతలకు సేవ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోమాత నుండి లభ్యమయ్యే పాలు,పేడ, పంచకం వంటివి ఎంతో ఉపయోగకరమైనవన్నారు. గోమాత సేవ చేస్తే సర్వ పాపాలు తొలగి సకల సిద్ధులు వరిస్తాయన్నారు. ప్రతి ఒక్కరు గోమాతను రక్షించి, గోమాతలకు సేవ చేయాలని కోరారు. అతి తొందరలో సిద్దిపేటలో గోమాతకు దేవాలయాన్ని నిర్మించేలా వెంకటేశ్వర స్వామి తమను ఆశీర్వదించాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us