Vegetable Prices: సామాన్యులకు చుక్కలే.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా ..?

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. నైరుతి రుతుపవనాలు వచ్చినా వర్షాలు పడకపోవడం, ఆలస్యంగా వర్షాలు మొదలవ్వడంతో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. ఈ ధరలను చూసి సామాన్యులు షాక్ అవుతున్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవనం కొనసాగించేవారికి బాధలు తప్పడం లేదు.

Vegetable Prices: సామాన్యులకు చుక్కలే.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా ..?
Vegetable

Updated on: Jun 25, 2026 | 8:04 AM

నైరుతి రుతుపవనాలు వచ్చినా వర్షాలు పడకపోవడం, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కూరగాయలు ధరలు రోజురోజుకి మండిపోతూ సామాన్యులకు షాకిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 20 శాతం నుంచి 30 శాతం వరకు ధరలు పెరిగాయి. దీంతో మార్కెట్‌కు వెళ్లిన సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇవి చుక్కలు చూపిస్తున్నాయి. తెలగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు వల్ల దిగుబడి భారీగా పడిపోయింంది. దీంతో స్థానికంగా కూరగాయలు అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. దళారులు ధరలను పెంచేయడంతో వ్యాపారులు కూడా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో వినియోగదారులపై భారం ఎక్కువగా పడుతోంది.

హైదరాబాద్‌లో ధరలు..

టమాటా ధర భారీగా పెరిగిపోయింది. కిలో టమాటా రూ.70 వరకు చేరుకుంది. పలు ప్రాంతాల్లో సెంచరీకి చేరుకుంది. ఇక కాకరకాయ, పచ్చిమిర్చి, క్యారెట్, బీరకాయ, కాకరకాయ, చిక్కుడు ధరలు కూడా పెరిగాయి. గతంలో కిలో కాకరకాయ రూ.30 నుంచి రూ.40 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా కేజీ రూ.60కి చేరుకుంది. ఇక గతంలో కిలో టమాట రూ.25గా ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.100 వరకు పలుకుతోంది. అలాగే బీర, క్యారెట్, చిక్కుడు ధరలు కూడా పెరిగాయి. అలాగే సొరకాయ, మెంతికూర ధరలు కూడా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో బెండ రూ.35, క్యారెట్ రూ.42, బీన్స్ రూ.75, గొరుచిక్కుడు రూ.28, చిక్కుడు రూ.45, బీర రూ.35, చామగడ్డ రూ.27, కీర రూ.40, క్యాప్చికం రూ.67, బీట్ రూట్ రూ.25, కందగడ్డ రూ.33, చిలకడదుంప రూ.21, వంగ రూ.18, బెండ రూ.35, దొండ రూ.18, ఉల్లిపాయ రూ.24, ఆలుగడ్డ రూ.17, క్యాబేజీ రూ.23 పలుకుతోంది.

విజయవాడలో ఎంతంటే..?

ఇక విజయవాడలోని రైతు మార్కెట్లలో కిలో వంగ రూ.42, బెండ రూ.20, పచ్చిమిర్చి రూ.40, కాకర రూ.44, క్యాబేజీ రూ.32, క్యారెట్ రూ.42, దొండ రూ.22, బంగాళదుంప రూ.24, ఉల్లిపాయ రూ.25, గోరుచిక్కుడు రూ.30, దోశ రూ.20, సొర రూ.13, చిక్కుళ్లు రూ.70, చామదుంప రూ.28, కంద రూ.40, చికలడదుంప రూ.28 పలుకుతున్నాయి. గతంలో రూ.300 ఖర్చు పెడితే వారానికి సరిపడ కూరగాయలు వచ్చేవి. కానీ ఇప్పుడు రూ.500 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. కూరగాయల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. ధరల పెరుగుదలతో సామాన్యుల జేబులకు చిల్లులు తప్పడం లేదు.

Follow Us