సోషల్ మీడియాలో చాలా జరుగుతుంటాయి. అన్నింటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే రాజకీయ నేతలు ప్రశ్నించుకోవడం.. దానికి సమాధానం ఇవ్వడం కూడా అప్పుడప్పుడు ఆసక్తిని రేపుతుంటాయి. తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత పేరిట ఓ సంస్థ కథనాన్ని ప్రచురిస్తే.. ఇది నిజమేనా అని అసదుద్దీన్ ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ట్యాగ్ చేశారు. దీంతో ఉత్తమ్ అదే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రాష్ట్రంలో ఒక్కరేషన్ కార్డును కూడా తొలగించలేదని.. అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు.
రేషన్ కార్డులను రద్దు చేశారా.. అంటూ అసద్ ట్వీట్ చేయగా.. ఉత్తమ్ రీట్విట్ చేస్తూ.. అసద్, రేషన్ కార్డుల రద్దు వార్త పూర్తిగా అబద్ధం. మా ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా ఒక్క రేషన్ కార్డును రద్దు చేయలేదు.. అంటూ ఆయనకు ట్యాగ్ చేశారు.
ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సమయంలో.. ఈ సోషల్ మీడియా ప్రశ్నలు.. సమాధానాలు కూడా ఆసక్తిరంగానే మారాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తుంటే.. ప్రతీ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది.
Asad, this news of cancellation of ration cards is totally false. Let me assure you, not one single ration card has been cancelled anywhere in the state by our Government. @asadowaisi https://t.co/sOyDEAfEo0
— Uttam Kumar Reddy (@UttamINC) January 4, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..