Amit Shah: తెలంగాణలో ఎగరబోయేది బీజేపీ జెండానే.. బీఆర్ఎస్ సర్కార్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడమే ఆలస్యం భారతీయ జనతా పార్టీ స్పీడును పెంచింది. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని పరితపిస్తున్న కాషాయదళం.. వరుస బహిరంగసభలతో దూసుకెళ్తోంది. డబుల్‌ ఇంజన్‌ సర్కారు నినాదంతో ప్రజలను ఆకట్టుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాషాయదళంలో ఫుల్ జోష్ నింపారు.

Amit Shah: తెలంగాణలో ఎగరబోయేది బీజేపీ జెండానే.. బీఆర్ఎస్ సర్కార్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్..
Amit Shah

Updated on: Oct 10, 2023 | 5:47 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడమే ఆలస్యం భారతీయ జనతా పార్టీ స్పీడును పెంచింది. ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని పరితపిస్తున్న కాషాయదళం.. వరుస బహిరంగసభలతో దూసుకెళ్తోంది. డబుల్‌ ఇంజన్‌ సర్కారు నినాదంతో ప్రజలను ఆకట్టుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాషాయదళంలో ఫుల్ జోష్ నింపారు. ఆదిలాబాద్‌లో బీజేపీ నిర్వహించిన జనగర్జన సభలో పాల్గొన్న అమిత్ షా అధికారపార్టీ బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగారు. డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ సర్కార్ వస్తే విమోచన దినోత్సవం ప్రతీ జిల్లాలో నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణకు డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని.. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అక్కడా, ఇక్కడా మోదీయే ఉంటారంటూ వివరించారు.

పదేళ్లుగా గిరిజన వర్శిటీ తెలంగాణాలో ఏర్పాటు చెయ్యాలని మోదీ ప్రయత్నిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం స్థలమే ఇవ్వలేదని అమిత్ షా ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటికీ రజాకర్ల పోకడలు పోలేదని విమర్శించారు అమిత్‌షా. ఈనాటి రజాకార్ల నుంచి తెలంగాణను కాపాడేది బీజేపీ మాత్రమే అంటూ నినదించారు. కేటీఆర్‌ని సీఎం చెయ్యడమే కేసీఆర్ లక్ష్యమన్నారు అమిత్‌షా. 2014 నుంచి సీఎం అదే పనిలో ఉన్నారని విమర్శించారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్‌ సర్కార్ కావాలన్నారు షా. డిసెంబర్ 3న తెలంగాణలో ఎగరబోయేది బీజేపీ జెండానే అంటూ అమిత్‌ షా ధీమా వ్యక్తంచేశారు.

కృష్ణా జలాల పంపిణీ కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నం ఏమీ లేదంటూ అమిత్‌షా ఫైర్ అయ్యారు. తెలంగాణకు న్యాయం చేసేలా ట్రెబ్యునల్‌ ఏర్పాటు చేసింది మోదీ మాత్రమేనన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీని నడిపిస్తోంది కేసీఆర్ కాదు.. మజ్లిస్ పార్టీ పెద్దలంటూ అమిత్ షా విమర్శించారు. కారు, స్టీరింగ్ అంటూ తనదైన స్టయిల్లో వ్యంగ్యంగా మాట్లాడారు.

అమిత్ షా వీడియో చూడండి..

తెలంగాణ నెం.1 అంటూ పదేపదే బీఆర్ఆర్ నేతలు చెబుతున్నారని, కానీ, అవినీతిలో, మహిళలపై దాడుల్లో, రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నెం.1గా నిలిచిందంటూ అమిత్‌షా పేర్కొన్నారు.

ప్రతి జిల్లాలో తెలంగాణ విమోచన దినోత్సవం

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ తో పాటు ప్రతి జిల్లాలో తెలంగాణ విమోచనా దినోత్సవం అధికారికంగా జరుపుతామని కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించారు. అదేవిధంగా గిరిజనులకు 3 ఎకరాల భూమి, రూ. 10 లక్షల దళిత బంధు హామీలు ఏమయ్యాయని కేసీఆర్ పై విమర్శల వర్షం గుప్పించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..