Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ విస్తరణ.. 1800 ఉద్యోగాలు

|

Jan 25, 2025 | 8:54 PM

Telangana: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో సమావేశమైన సందర్భంగా గ్రూప్ రియల్ ఎస్టేట్ అండ్ సప్లై చైన్, యూబీఎస్‌ ఇండియా చైర్మన్ హెరాల్డ్ ఎగ్గర్ కాన్ఫెడరేషన్ సూయిస్, కాన్ఫెడరేషన్ నిర్వహించిన TEPA ఇన్వెస్ట్‌మెంట్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు..

Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ విస్తరణ.. 1800 ఉద్యోగాలు
Follow us on

స్విట్జర్లాండ్‌లోని అతిపెద్ద బ్యాంకింగ్ దిగ్గజం UBS, హైదరాబాద్‌లోని తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ని విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో అదనంగా 1,800 మంది ఉద్యోగులను నియమించుకోనున్నారు. శుక్రవారం జ్యూరిచ్‌లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో జరిగిన సమావేశంలో  గ్రూప్ రియల్ ఎస్టేట్ అండ్ సప్లై చైన్, యూబీఎస్‌ ఇండియా చైర్మన్ హెరాల్డ్ ఎగ్గర్ కాన్ఫెడరేషన్ సూయిస్, కాన్ఫెడరేషన్ నిర్వహించిన TEPA ఇన్వెస్ట్‌మెంట్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ విస్తరణ ప్రధానంగా హైదరాబాద్‌లో UBS ఫైనాన్స్, కార్యకలాపాలను బలోపేతం చేస్తుంది.

మంత్రి శ్రీధర్ బాబు భారతదేశంలోనే అగ్రగామి జిసిసి హబ్‌గా హైదరాబాద్‌ ఎదుగుతున్నందుకు గర్వపడుతున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. తెలంగాణ ఐటి ఎగుమతులు 30 బిలియన్ డాలర్లను అధిగమించాయని, నగరంలో జిసిసిల వృద్ధి కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నడిపించడం కొనసాగిస్తున్నదని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జిసిసి) కోసం హైదరాబాద్‌ను దేశంలోనే అగ్రగామి కేంద్రంగా ఎదుగుతున్నందున, పెట్టుబడి-స్నేహపూర్వక, సాంకేతికతతో నడిచే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న రాష్ట్రంగా భావిస్తున్నమని అన్నారు.

తెలంగాణ ఐటి ఎగుమతులు $30 బిలియన్లను అధిగమించాయని, హైదరాబాద్‌లో జిసిసిల వృద్ధిని చూస్తూనే ఉన్నామన్నారు. ఉపాధికి కొత్త మార్గాలను సృష్టించడం, మా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నడిపించడం లక్ష్యమన్నారు. అయితే యూబీఎస్‌ కార్యకలాపాల విస్తరణ మా మౌలిక సదుపాయాలు, ప్రతిభపై ప్రపంచ వ్యాపారాలు ఉంచుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. స్విట్జర్లాండ్, ఇతర EFTA దేశాల నుండి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇన్వెస్ట్ తెలంగాణ సెల్‌తో ప్రత్యేక TEPA డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా హెరాల్డ్ ఎగ్గర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో దాని ఉనికిని రెట్టింపు చేయాలనే UBS నిర్ణయమని, ప్రాంతంలో అసాధారణమైన ప్రతిభ, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కలిగి ఉందన్నారు. తెలంగాణలో మా ఉనికిని మరింతగా పెంచుకోవడానికి మంచి అవకాశమని, అందుకు సంతోషిస్తున్నామని అన్నారు. ఇక్కడి ప్రాంతం వృద్ధికి ఈ బలాలను ఉపయోగించుకుని ముందుకు సాగుతామన్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి