
నిర్మల్ జిల్లాను చిరుత పులుల సంచారం భయపెడుతోంది. ఒకే రోజు రెండు చిరుతలు జనం కంటపడటంతో ఆ భయం రెట్టింపు అయింది. ఖానాపూర్ పట్టణ శివారులోని కొమురం భీం చౌరస్తా నుంచి తర్లపాడు వెళ్లే మార్గంలో శనివారం రాత్రి అడవి నుంచి గ్రామంలోకి వెళుతూ ఓ చిరుత ప్రయాణికుల కంట పడింది. తర్లపాడు నుంచి ఖానాపూర్ వైపు వెళుతున్న ఓ ప్రయాణికుడు కారులో నుంచి రోడ్డు దాటుతున్న చిరుతను తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాల్లో ఖానాపూర్ మండలంలోని దిలావర్ఫూర్ శివారులోని బొక్కలగుట్ట సమీపంలోని ఓ పంటపొలంలో మరో చిరుతపులి సంచరించడం కలకలం రేపింది. పంటచేనులో రైతు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో చిరుత పులి కదలికలు రికార్డ్ అయ్యాయి.
అది గుర్తించిన రైతు అటవిశాఖ అధికారులకు సమాచారం అందించాడు. మండలంలో ఒకేరోజు రెండు చిరుతలు కెమెరాలకు చిక్కడంతో సోషల్ మీడియోలో ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. చిరుతల సంచారం ఘటనతో అటవీశాఖ అప్రమత్తమైంది. దీంతో ఖానాపూర్ మండలం సమీప ప్రాంతాల ప్రజలను తర్లపాడు, దిలావర్పర్ గ్రామాల రైతులు, ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది అటవీశాఖ. తాజాగా సాగిన జంతు గణనలో గణనీయంగా చిరుతల సంఖ్య పెరిగినట్టు సమాచారం. పెంబి అడవి ప్రాంతంలో మాంసాహార జంతువుల సంఖ్య రెట్టింపు అయినట్టు అటవిశాఖ ప్రాథమికంగా గుర్తించింది.
ఇది చదవండి: అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్‌గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..