Telanagan News: ముంచుకొచ్చిన మృత్యువు.. పిడుగు పాటుతో ఒకే రోజు 8 మంది మృతి

తెలంగాణలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగుపాటుతో ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 8 మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ జిల్లాలో ముగ్గురు, జోగులాంబ గద్వాల జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.

Telanagan News: ముంచుకొచ్చిన మృత్యువు.. పిడుగు పాటుతో ఒకే రోజు 8 మంది మృతి
Telangana News

Updated on: Sep 10, 2025 | 9:45 PM

తెలంగాణలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, పిడుగుపాటుతో ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 8 మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మేన ఏంగ్లాపూర్ గ్రామానికి చెందిన అలకుంట ఎల్లయ్య, ఎల్లవ్వ అనే ఇద్దరు భార్యభర్తలతో పాటు బండారు వెంకటి అనే వ్యక్తి పిగుడు పాటుతో మృతి చెందారు. వీరందూ గ్రామ సమీపంలోని వ్యవసాయ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగు పడటంతో మృతి చెందారు.

ఇదిలా ఉండా జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం భూంపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ (22), సర్వేశ్‌ (20), సౌభాగ్యమ్మ అనే రైతులు పొలంలో పత్తి తీస్తుండగా ఒక్కసారిగా పిగుడు పడింది. ఈ ప్రమాదంలో పార్వతమ్మ, సౌభాగ్యమ్మతో పాటు సర్వేశ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు కూళీలు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన వారికి స్థానిక హాస్పిటల్‌కు తరలించారు.

మరోవైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే క్రమంలో పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ధారావత్ మహేష్ (35)అనే వ్యక్తి పశువులను మేపేందుకు బయటకు వెళ్లగా వర్షం కురుస్తుందని చెట్టు వద్దకు వెళ్ళాడు. అకస్మాత్తుగా పిడుగు పడటంతో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే మదిర మండలం మడుపల్లి గ్రామంలో పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగు పడి గడిపూడి వీరభద్ర రావు అనే రైతు మృతి చెందాడు.

ఇలా కేవలం బుధవారం ఒక్కరోజులోనే తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాలో పిడుగు పాటుకు గురై మొత్తం ఎనిమిది మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉండగా ఐదుగురు పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వరుస ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.