Revanth Reddy: పాదయాత్రలో గోడదూకిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

మహబూబాబాద్‌జిల్లా మరిపెడలో ఎస్టీ మినీ గురుకులంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నించారు. అయితే గేటుకు తాళంవేసి ఉండటంతో రేవంత్‌రెడ్డి గోడ ఎక్కి దూకేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను..

Revanth Reddy: పాదయాత్రలో గోడదూకిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
Revanth Reddy

Updated on: Feb 09, 2023 | 8:28 PM

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గోడ దూకేశారు. మహబూబాబాద్‌జిల్లా మరిపెడలో ఎస్టీ మినీ గురుకులంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నించారు. అయితే గేటుకు తాళంవేసి ఉండటంతో రేవంత్‌రెడ్డి గోడ ఎక్కి దూకేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను కలిసి సమస్యలపై ఆరా తీశారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించేలా చూడాలని ఉపాధ్యాయులు కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు.

ప్రగతి భవన్‌పై రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన కామెంట్స్ రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం కూడా రేవంత్ చేసిన కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా.. ? అని మంత్రి కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో ప్రశ్నించారు. మరోవైపు ఈ విషయంలో ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతల కామెంట్లను పట్టించుకోని రేవంత్ రెడ్డి మరోసారి ప్రగతి భవన్‌పై మాటల తూటాలను దించేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను బీఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మారుస్తామని ప్రకటించారు.

రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో ప్రజల సమస్యలను రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా వరంగల్ జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లా ఎల్లంపేటకు చేరుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం