Fact Check: ఇఫ్తార్ విందు పై వైరల్ వీడియో హైదరాబాద్ నుంచి కాదు.. ఉత్తరప్రదేశ్ లో చిత్రీకరించింది..

|

Apr 22, 2021 | 10:44 PM

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు పెరగడంతో, సోషల్ మీడియాలో కరోనాకి సంబంధించిన వార్తలు విపరీతంగా పెరిగిపోతూ వచ్చాయి. అదే సమయంలో రాజకీయ సంబంధ వార్తలూ ఇబ్బడి ముబ్బడిగా సోషల్ మీడియాలో దాడి మొదలు పెట్టాయి.

Fact Check: ఇఫ్తార్ విందు పై వైరల్ వీడియో హైదరాబాద్ నుంచి కాదు.. ఉత్తరప్రదేశ్ లో చిత్రీకరించింది..
Fact Check Hyderabad
Follow us on

Fact Check: దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులు పెరగడంతో, సోషల్ మీడియాలో కరోనాకి సంబంధించిన వార్తలు విపరీతంగా పెరిగిపోతూ వచ్చాయి. అదే సమయంలో రాజకీయ సంబంధ వార్తలూ ఇబ్బడి ముబ్బడిగా సోషల్ మీడియాలో దాడి మొదలు పెట్టాయి. ఒక్కోసారి ఈ ధోరణిలో అసత్యాలను కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రాచుర్యంలోకి తీసుకువస్తున్నారు. ఇటీవల హరిద్వార్ లో కుంభ మేళా జరిగిన సంగతి విదితమే. కోవిడ్ సెకండ్ వేవ్ పెరిగిపోతున్న సమయంలో అక్కడ అలా గుంపులుగా గంగా స్నానాలు చేయడం ఏమిటంటూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. కుంభ మేళా వలన కరోనా ఎక్కువ అవుతోందంటూ ప్రచారం సాగించారు. అదే సమయంలో ప్రధాని మోడీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కుమ్భామేలాను ఆపు చేయాలని సాధువులను కోరారు. తరువాత కుంభ మేళా ముగించేశారు.

ఇదిలా ఉంటె ఇదే సమయంలో హైదరాబాద్ కు చెందినదిగా చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైదరాబాద్ లో భారీ ఇఫ్తార్ విందు జరిగింది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆ వీడియోను విపరీతంగా షేర్ చేశారు నెటిజన్లు. అయితే, ఇప్పుడు ఆ వీడియో ఫేక్ అని తేలింది. ది క్వింట్ నిర్వహించిన ఫాక్ట్ చెక్ లో నిజానికి ఆ వీడియో ఉత్తరప్రదేశ్ కు చెందినదిగా తేలింది. ఈ వీడియో హైదరాబాద్ లోని ఇఫ్తార్ పార్టీ నుండి కాదు, ఉత్తర ప్రదేశ్ లోని సంభాల్ లో జరిగిన అంత్యక్రియల నుండి వచ్చిన వీడియో. మౌలానా అబ్దుల్ మోమిన్ నద్వి అంత్యక్రియలకు హాజరు కావడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడిన అంజుమాన్ ముయినుల్ ఇస్లాం మదర్సా నుండి ఈ ఫుటేజ్ చిత్రీకరించినట్లు ఈ నివేదిక ధృవీకరించింది.

దీంతో కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఇఫ్తార్ విందు పేరుతో ప్రచారంలో ఉన్న వీడియో అసత్యమని తేలింది. ఈ నేపధ్యంలో ఈ సంఘటన సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు షేర్ చేసేముందు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతోంది.

ప్రచారంలో ఉన్న సోషల్ మీడియా పోస్ట్ లలో ఇదీ ఒకటి!

Also Read: Hero Dog: స్విమ్మింగ్ పూల్ పడిపోయిన పమేరియన్.. అది చూసిన దాని ఫ్రెండ్ ఏం చేసిందో చూస్తే ఫిదా అయిపోతారు Viral Video

Bengaluru Volunteers: కరోనా మృతదేహాలకు ఆ నలుగురే.. అన్ని మతాల సాంప్రదాయాలతో అంత్యక్రియలు