Telangana: పెద్ద ప్లానే ఇది.. పోలీస్ ఈవెంట్స్ కోసం వచ్చిన మహిళా అభ్యర్థి మాస్టర్ స్కెచ్.. కానీ..

ఎలక్ట్రానిక్ పరికరం కారణంగా మహిళ పట్టుబడిందని, లేకపోతే ఆమె తన ప్రయత్నాలలో విజయం సాధించి ఉండేదని ఎస్పీ తెలిపారు.

Telangana: పెద్ద ప్లానే ఇది.. పోలీస్ ఈవెంట్స్ కోసం వచ్చిన మహిళా అభ్యర్థి మాస్టర్ స్కెచ్.. కానీ..
Police Candidate Cheating

Updated on: Dec 14, 2022 | 8:12 PM

ఆమెకు పోలీసు కొలువు కొట్టాలని ఆశ. ఎత్తు ఏమో సరిపడనంత లేదు. దీంతో ఏదో ఒకలా చీటింగ్ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే నడి నెత్తిన జుట్టులో ఎం-సీల్ మైనపు ముక్కను ఉంచి ఎత్తు ఎక్కువ చూపేందుకు ప్రయత్నించింది. ఆమెను పట్టుకున్న అధికారులు మోసం చేశారనే ఆరోపణలపై అనర్హత వేటు వేశారు. మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న పోలీసు కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ శారీరక దారుఢ్య పరీక్షల సందర్భంగా ఈ ఘటన వెలుగుచూసింది. మహబూబ్ నగర్ ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలక్ట్రానిక్ ఎత్తు కొలిచే పరికరంపై మహిళ నిల్చున్న వెంటనే సెన్సార్ స్పందించలేదు. దీంతో అధికారులు తొలుత ఆ మెషీన్ ప్రాబ్లమ్ ఏమో అని భావించారు. చెక్ చేస్తే అంతా బానే ఉంది. దీంతో  ఎత్తు కొలిచే మహిళా అధికారి అభ్యర్థి తలను పరిశీలించి స్టన్ అయ్యారు. ఎత్తు ఎక్కువగా చూపేందుకు.. ఆమె తన జుట్టు కింద ఉబ్బెత్తుగా M-సీల్ మైనాన్ని అతికించినట్లు గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.

ఎలక్ట్రానిక్ మిషన్‌పై అభ్యర్థి నిలబడితే, సెన్సార్లు వెంటనే  తల నుంచి పాదాల వరకు పర్ఫెక్ట్‌గా కొలుతలు తీసుకుంటాయని.. ఇందులో అసలు అవకతవకలు చాన్స్ లేదన్నారు. ఎలక్ట్రానిక్ పరికరం ఉండబట్టి ఆమె దొరికిపోయిందని.. మాన్యువల్ పద్దతిలో అయితే  ఆమె తన ప్రయత్నాలలో విజయం సాధించి ఉండేదని ఆయన తెలిపారు. సదరు మహిళా అభ్యర్థిని వెంటనే సీనియర్ అధికారుల ముందు హాజరుపరిచారు. వారు ఎస్పీని సంప్రదించిన తర్వాత ఆమెపై అనర్హత వేటు వేశారు.

భౌతిక కొలతలు, ఖచ్చితత్వం కోసమే కాకుండా.. వివిధ పరీక్షల నిమిత్తం అధునాతన పరికరాలను ఉపయోగిస్తున్నామని, తద్వారా నిజమైన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి మోసాలు ఎవరైనా చేస్తే.. వారు జీవితంలో పోలీస్ శాఖలో ప్రవేశించలేరని వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం