Weather Report: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వాయవ్య బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. అలాగే వర్షాల సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.

Weather Report: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
Telangana Weather Update

Updated on: Oct 17, 2026 | 3:18 PM

తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతోందని.. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, పరిసర ప్రాంతాలలో ఉన్న సదరు ఉపరితల ఆవర్తనం నుండి వాయవ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ద్రోణి, ఈ రోజు బలహీనపడిందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల వాతావరణం ఎలా ఉండబోతోందో వాతావరణ శాఖ అంచనా వేసింది.

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకారం.. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆది, సోమవారాల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

తెలంగాణ వెదర్‌మ్యాన్ ప్రకారం..

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో వాతావరణ అప్‌డేట్స్ చెప్పే తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా ప్రకారం.. రానున్న గంటల్లో నల్గొండ జిల్లా, సూర్యాపేట, ఖమ్మం అంతటా చెదురుమదురు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. అలాగే హన్మకొండ, భద్రాద్రి – కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్, మంచిర్యాల మీదుగా ఈ వర్షాలు విస్తరించే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఇక సాయంత్రం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us