AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చుక్క నూనె, పాలు పంచదార లేకుండా నోట్లో వెన్నల కరిగిపోయే హెల్తీ స్వీట్..

తీపి తినాలనిపించినప్పుడు, ఆరోగ్యానికి హానికరం కాని స్వీట్ కోసం చూస్తుంటే, అటుకులు, కొబ్బరి పాలు, బెల్లంతో తయారుచేసే ఈ వంటకం సరైన ఎంపిక. ఎటువంటి నూనె, నెయ్యి, పాలు, పంచదార లేకుండానే నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ హెల్తీ స్వీట్‌ను చాలా సులభంగా తయారుచేయవచ్చు. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడే ఈ వంటకం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

Prasanna Yadla
|

Updated on: Oct 17, 2026 | 2:51 PM

Share

1 / 5
ఈ స్వీట్ తయారీకి ముందుగా కొబ్బరి చిప్పలను తీసుకోవాలి. పెద్ద సైజులో ఉన్న రెండు పచ్చి కొబ్బరి చిప్పలను తీసుకుని, వాటి వెనక ఉన్న పొట్టును తీసివేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి, అవసరమైన మేరకు నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేయాలి. ఇలా పొట్టు తీసి గ్రైండ్ చేయడం వల్ల కొబ్బరి పాలు తెల్లగా, చక్కగా వస్తాయి. గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్‌ను పల్చని క్లాత్ లో వేసి గట్టిగా పిండి, చిక్కటి కొబ్బరి పాలను సేకరించాలి. ఈ స్వీట్ కోసం సుమారు మూడు కప్పుల చిక్కటి కొబ్బరి పాలు అవసరమవుతాయి. కొబ్బరి పాలలో ఉండే సహజ నూనెలే స్వీట్‌కు సరిపోతాయి కాబట్టి అదనంగా నూనె లేదా నెయ్యి అవసరం లేదు.

2 / 5
తరువాత, మరొక మిక్సీ జార్ తీసుకుని, ఒక కప్పు దొడ్డు అటుకులను శుభ్రం చేసుకుని వేసి, మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ అటుకుల పొడిని ముందుగా మూడు కప్పుల కొబ్బరి పాలలో వేసి, ఉండలు లేకుండా బాగా కలిపి నానబెట్టాలి. అటుకుల పొడి పాలలో కలిసిన తర్వాత మిశ్రమం కొద్దిగా చిక్కబడుతుంది. అటుకులు నానడం వల్ల ఇది మరింత దగ్గరగా పేస్ట్ లా తయారవుతుంది.

3 / 5
ఇక బెల్లం పాకం కోసం, స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని, అందులో రెండు కప్పుల బెల్లం, ముప్పావు కప్పు నీళ్లు పోసి, బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగి నీళ్లలా మారిన తర్వాత, నానబెట్టుకున్న అటుకులు, కొబ్బరి పాలు మిశ్రమాన్ని ఈ బెల్లం పాకంలో వేసి బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. స్టవ్‌ను సిమ్ లో ఉంచి ఉడికించాలి, హై ఫ్లేమ్‌లో ఉంచితే మిశ్రమం చిందుతుంది.

4 / 5
ఈ మిశ్రమం నెమ్మదిగా దగ్గర పడుతూ, కొబ్బరి పాలలో ఉన్న నూనె బయటికి వస్తుంది. ఈ ప్రక్రియలో మంచి సువాసన వస్తుంది. మిశ్రమం దగ్గరపడి, నూనె బయటికి వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించాలి. చాలా వరకు దగ్గరగా వచ్చిన తర్వాత, రుచి కోసం ఒక స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. మిశ్రమం మరింత దగ్గరగా వచ్చి, కొబ్బరి నూనె పూర్తిగా వేరుపడి, స్వీట్ ఒక ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా, ఈ స్వీట్ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యి పూయని ఒక ట్రేలోకి తీసుకుని సమానంగా స్ప్రెడ్ చేయాలి. రెండు మూడు సార్లు ట్యాప్ చేసి, పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, ట్రే నుండి సులభంగా వేరు చేసి, నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోవచ్చు

5 / 5
Follow Us