Telangana: మంత్రులుగా ప్రమాణం చేయనుంది వీళ్లే..!

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరే సమయం ఆసన్నమైంది. కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసేందుకు సర్వంసిద్ధమైంది. సరిగ్గా ఒంటి గంటా నాలుగు నిమిషాలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేవంత్‌. అందుకు, సర్వాంగ సుందరంగా సిద్ధమైంది ఎల్బీ స్టేడియం.

Telangana: మంత్రులుగా ప్రమాణం చేయనుంది వీళ్లే..!
Revanth Reddy

Updated on: Dec 07, 2023 | 12:59 PM

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీలు, ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సభకు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీసులు.. అందుకు తగ్గట్టుగానే భద్రతా ఏర్పాట్లు చేశారు. తాజాగా మంత్రుల జాబితాలో ఉన్నవారికి ఠాక్రే నుంచి ఫోన్లు వెళ్లాయి. 11 మంది మంత్రులతో రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మరోవైపు తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్‌ను కన్ఫామ్ చేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో టెక్స్ టైల్ మంత్రిగా ప్రసాద్ కుమార్ పని చేశారు.

కేబినెట్ బెర్త్ దక్కించుకున్న వారి వివరాలు

  1. భట్టి విక్రమార్క – డిప్యూటీ సీఎం
  2. ఉత్తమ్ కుమార్ రెడ్డి
  3. పొన్నం ప్రభాకర్
  4. కోమటిరెడ్డి వెంకటరెడ్డి
  5. దామోదర రాజనర్సింహ
  6. దుద్దిళ్ల శ్రీధర్ బాబు
  7. పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  8. కొండా సురేఖ
  9. సీతక్క
  10. తుమ్మల నాగేశ్వరరావు
  11. జూపల్లి కృష్టారావు

ఎల్బీ స్టేడియం సెంటిమెంట్‌ ఏంటి?

సాధారణంగా ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారాలు రాజ్‌భవన్‌లోనే జరుగుతాయ్‌. అయితే, ఆ రెగ్యులర్‌ ఫార్మాట్‌ను బ్రేక్‌చేసి ట్రెండ్‌ సృష్టించారు ఎన్టీఆర్‌. 1994 డిసెంబర్‌లో ఎల్బీ స్టేడియం వేదికగా అచ్చ తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు ఎన్టీఆర్‌. ఆనాడు ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రమాణస్వీకారోత్సవం జాతరను తలపించింది. అప్పట్లో అదో సంచలనం. ఆ తర్వాత అదే ట్రెండ్‌ను కొనసాగించారు వైఎస్సార్‌. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించడంతో ఇదే ఎల్బీస్టేడియంలో వేలాదిమంది ప్రజల మధ్య ప్రమాణస్వీకారం చేశారు. అక్కడే ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా ఎల్బీ స్టేడియం ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా ప్రమాణస్వీకారం చేయబోతున్న రేవంత్‌…. సకల జనుల సాక్షిగా ఆరు గ్యారంటీలపై తొలి సంతకం చేయబోతున్నారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దిగువన వీక్షించండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…