Telangana Corona: కరోనా విజృంభణ.. జీహెచ్ఎంసీ, ఆ రెండు జిల్లాల్లోనే ఎక్కువ కేసులు.. మొత్తం ఎన్ని నమోదయ్యాయంటే..?

|

Apr 15, 2021 | 10:17 AM

Telangana Coronavirus Updates: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం రెండు

Telangana Corona: కరోనా విజృంభణ.. జీహెచ్ఎంసీ, ఆ రెండు జిల్లాల్లోనే ఎక్కువ కేసులు.. మొత్తం ఎన్ని నమోదయ్యాయంటే..?
Follow us on

Telangana Coronavirus Updates: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కూడా కేసులు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం రెండు వేలకుపైగా నమోదైన కేసులు కాస్త.. గురువారం మూడు వేలు దాటాయి. తెలంగాణలో గత 24గంటల్లో (బుధవారం) కొత్తగా 3,307 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 8 మంది మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.38,045 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,788కి చేరింది.

కాగా.. నిన్న కరోనా నుంచి 897 మంది కోలుకున్నారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,08,396కి పెరిగింది. ప్రస్తుతం 27,861 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 18,685 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.22 శాతం ఉండగా.. మరణాల రేటు 0.52 శాతం ఉంది. కాగా.. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 446 నమోదయ్యాయి. మేడ్చెల్ మల్కాజ్‌గిరిలో 314, రంగారెడ్డిలో 277 కేసులు నమోదయ్యాయి.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు..

Telangana Covid19

ఇదిలాఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 1,06,627 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 1,13,60,001కి పెరిగింది. దీంతోపాటు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పలు సలహాలు, సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.

Also Read: