GHMC – Hyderabad BJP: బీజేపీ కార్పొరేటర్ల గోల వెనుక అసలు కథ ఇదా?.. భారీ ప్లాన్ వేశారుగా..!

GHMC - Hyderabad BJP: గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీజేపీ దూకుడు పెంచింది. బల్ధియా కార్యాలయాన్ని ముట్టడించి రచ్చరచ్చ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు పోటీపడి మరీ కార్యక్రమాలు..

GHMC - Hyderabad BJP: బీజేపీ కార్పొరేటర్ల గోల వెనుక అసలు కథ ఇదా?.. భారీ ప్లాన్ వేశారుగా..!
Bjp
Follow us

|

Updated on: Nov 26, 2021 | 7:06 AM

GHMC – Hyderabad BJP: గ్రేటర్‌ హైదరాబాద్‌లో బీజేపీ దూకుడు పెంచింది. బల్ధియా కార్యాలయాన్ని ముట్టడించి రచ్చరచ్చ చేశారు. బీజేపీ కార్పొరేటర్లు పోటీపడి మరీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్పోరేటర్ల మధ్య పోటీకి అసలు కారణం వేరే ఉందట. ఇంతకీ కార్పొరేటర్ల మధ్య పోటీకి కారణమేంటీ ? గ్రేటర్‌లో బీజేపీ దూకుడు వెనక మర్మమేంటీ ? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌ మహానగరంలో కమలనాథులు దూకుడు పెంచారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించడం లేదంటూ బల్ధియా కార్యాలయాన్ని ముట్టడించారు. మేయర్‌ చాంబర్‌ ఎదుట రచ్చ చేశారు. బీజేపీ నుంచి గెలిచిన 47 మంది కార్పొరేటర్లు తమ బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేశారు. గెలిచి యేడాది అవుతున్న బీజేపీ కార్పోరేటర్లు ఒక నాయకుడిని ఎన్నుకోలేక పోతున్నారు. అధిష్టానం కూడా ఫ్లోర్‌ లీడర్‌ నియామించకుండా జాప్యం చేస్తుంది. ఆ పదవిని దక్కించుకునేందుకు కార్పోరేటర్లు భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు.

GHMCలో ఎంఐఎం కంటే ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తుంది. ఫ్లోర్‌ లీడర్‌ పోస్ట్‌ దక్కించుకోవడానికి పలువురు కార్పోరేటర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారు అధిష్టానం మెప్పు పొందాలని చూస్తున్నారు. గుడిమల్కాపూర్‌ కార్పోరేటర్‌ దేవరకరుణాకర్‌, మైలార్‌దేవ్‌పల్లి కార్పోరేటర్‌ తోకల శ్రీనివాస్‌రెడ్డి, చంపాపేట కార్పోరేటర్‌ వంగా మధుసూధన్‌రెడ్డితో పాటు పలువురు ఫ్లోర్‌ లీడర్‌ పోస్ట్‌ కోసం పోటీపడుతున్నారు. GHMCలో అధికారపార్టీని ఆత్మరక్షణలో పడేసి ఇరకాటంలో నెట్టగల సమర్థుల ఎంపిక కోసం బీజేపీ అధిష్టానం సమాలోచనలు చేస్తుంది.

బీజేపీ అధిష్టాన పెద్దలు మాత్రం ఫ్లోర్‌లీడర్‌ పదవి ఒకరికి సిఫారసు చేస్తే మిగతావారి నుంచి నిష్టూరం కావాల్సి వస్తుందని ఆ అంశం చర్చించడానికి ఇష్టపడటం లేదట. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, లక్షణ్, డీకే అరుణ వద్దకు ఎవరికి వారు వెళ్లి కార్పొరేటర్లు మొరపెట్టుకుంటున్నారు. ప్రజా సమస్యలపై నిలదీసే అవకాశం దక్కించుకోవడానికి బీజేపీ కార్పోరేటర్లు తమ ఫర్మమెన్స్‌ ప్రదర్శిస్తున్నారట. ఈ క్రమంలోనే మొన్న జీహెచ్ఎంసీపై దాడి జరిగినట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. అయితే, పార్టీ అధిష్టానం మాత్రం ఎటూ తేల్చకపోవడంతో కొంత అసంతృప్తితో రగిలిపోతున్నారు బీజేపీ కార్పోరేటర్లు.

అగస్త్య, టీవీ9 తెలుగు రిపోర్టర్.

Also read:

Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే..

Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..

Flashback: చీరకట్టులో అనసూయ.. రొమాంటిక్‌గా రెజీనా, ప్రభుదేవా.. ఆకట్టుకుంటోన్న ఫ్లాష్‌బ్యాక్‌ కొత్త పోస్టర్లు..