
తెలంగాణ పొలిటికల్ ట్రెండ్‌లో సడన్‌గా ఒక ఛేంజ్ కనిపిస్తోంది. పొట్టుపొట్టు తిట్లు కాదు, జనం బాగోగుల మీద ఒట్లేసుకుందాం..! బూతులతో కాదు, మన్‌కీ బాత్‌లతో కొట్లాడుకుందాం.. ప్రజా సమస్యలపై అంశాలవారీ యుద్ధం చేద్దాం.. సిద్ధమా? అని మూడు వైపుల నుంచీ గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చుకుంటున్నాయి. ఇప్పటిగ్గాని రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు కరెక్ట్ మూడ్‌లోకొచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోలాగా రప్పారప్పా పాలిటిక్స్ కాకుండా ఇక్కడ ప్యూర్ వెజిటేరియన్ పాలిటిక్స్ షురూ ఐనట్టున్నాయి. వెరీ గుడ్ సైన్ కదా? కాకపోతే సౌండ్ బాక్సులే బద్దలైపోతున్నాయ్.. ఫికర్ మత్‌కరో మైహూనా.. నా రాష్ట్ర ప్రజలకు ఏంకావాలో ఏం చేయాలో నాకంటే ఎవ్వరికీ బాగా తెలీదు.. అని భరోసానిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. అటు అభివృద్ధిపనులు- ఇటు ఆసరా మాటలు.. సొంత జిల్లా పాలమూరు పర్యటనలో జనాన్ని ఫిదా చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి తనలోని సాధుస్వభావాన్నంతా కుమ్మరించేశారు. తానొక ఫైర్‌బ్రాండ్‌ననే సంగతినే మర్చిపోయినట్టు కనిపించారు. పవన్‌కల్యాణ్ కామెంట్లకు మంత్రి పొన్నం బదులిచ్చారు సరిపోదా అని తెలివిగా ఎస్కేపయ్యారు. బాల్క సుమన్ మిలిటరీ యాక్షన్ సంగతి పోలీసులే చూసుకుంటారన్నారు తప్ప.. పల్లెత్తు మాటైనా అన్లేదు. కాకపోతే, ఆ కూల్‌కూల్ నేచర్ ఆ కొద్దిసేపే. సాయంత్రం ఎండవేడి తగ్గిన తర్వాత, రేవంత్ మార్క్ ఆఫ్ ఫైరింగ్ షురూ ఐంది. మీరు సాఫ్ట్‌వేర్‌లోకి మారితే మేమూ సాఫ్ట్‌వేరైపోతాం.. మీది హార్డ్‌వేర్ ఐతే నాదీ హార్డ్‌వేరే అని తన ఒరిజినల్ పిచ్‌లోకి మారిపోయారు. మీ పదేళ్ల పాలన.....