Online Loan apps: ఆన్‌లైన్ యాప్‌లపై తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. ఆ యాప్‌లను నిషేధించాలంటూ..

|

Dec 20, 2020 | 2:19 PM

ఆన్‌లైన్‌ కాల్ మనీ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆన్‌లైన్ లోన్ యాప్స్ కారణంగా ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో..

Online Loan apps: ఆన్‌లైన్ యాప్‌లపై తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం.. ఆ యాప్‌లను నిషేధించాలంటూ..
Follow us on

Online Loan apps: ఆన్‌లైన్‌ కాల్ మనీ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఆన్‌లైన్ లోన్ యాప్స్ కారణంగా ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో విచారణను వేగవంతం చేశారు. ఈ దారుణ యాప్ లను కట్టడి చేసేందుకు పకడ్బందీ చర్యలకు పూనుకున్నారు. ఇప్పటికే మైక్రో ఫైనాన్సి్ యాప్‌లను రూపొందించిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాల్ మనీ యాప్ లు నిషేధించాలని కేంద్ర హోం శాఖ, ఐటీ శాఖ లకు తెలంగాణ పోలీస్ శాఖ లేఖ రాసింది. ఈ యాప్‌ల వల్ల అమాయలకు భారీ నష్టం వాటిల్లడమే కాకుండా.. వారి ప్రాణాలకు సైతం ముప్పులోకి నెట్టేస్తున్నాయని పేర్కొన్నారు.

 

కాగా, పోలీసులు అదుపులో ఉన్న యువకుడు.. నాలుగు నెలల నుండి యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తున్నట్లు గుర్తించారు. అతనొక్కడే కాదు.. ఇలా ఎంతో మంది లోన్ యాప్‌లను నిర్వహిస్తూ మైక్రో ఫైనాన్స్ నడుపుతున్నారు. అలా తమ నుండి రుణం పొందిన వారు.. డబ్బులు కట్టడంలో ఆలస్యం చేస్తే మైక్రో ఫైనాన్స్ ఏజెంట్లు మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలాఉంటే.. మైక్రో ఫైనాన్స్ యాప్‌లో లోన్ తీసుకున్న అమౌంట్‌కి 50శాతం పైన వడ్డీ చెల్లించినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా అడ్డూ అదుపూ లేకుండా వడ్డీలు వసూలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాప్‌లపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ పోలీస్ నడుం బిగించింది.

 

Also read:

ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక పూజలు… లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న హై కోర్టు చీఫ్ జస్టిస్ దంపతులు…

జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసినా తగ్గని హీట్.. టీఆర్ఎస్ నాయకురాలి ఇంటిపై దుండగుల దాడి..