Telangana Congress: మరో కీలక నేత కాంగ్రెస్‌ని వీడుతారా? హాట్ టాపిక్‌గా మారిన తాజా గుసగులు..!

|

Mar 02, 2022 | 7:44 PM

Telangana Congress: ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత ఈ మధ్య సైలెంట్‌గా ఉంటున్నారు.

Telangana Congress: మరో కీలక నేత కాంగ్రెస్‌ని వీడుతారా? హాట్ టాపిక్‌గా మారిన తాజా గుసగులు..!
Congress Party
Follow us on

Telangana Congress: ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేత ఈ మధ్య సైలెంట్‌గా ఉంటున్నారు. ఒక్కప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన నేత.. ఓ దశలో రాష్ట్ర రాజకీయాలని శాసించిన ఆ నేత.. ఇప్పుడు మాత్రం జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదు.. పార్టీలో కూడా చాలా సైలెంట్ అయ్యారు. ఇంతకీ ఎవరా నేత? ఎందుకు ఇప్పుడు సైలెంట్ అయ్యారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న నేత ఇప్పుడు సైలెంట్ అయ్యారు. జిల్లాలోనే కాదు తన సొంత నియోజకవర్గం ఆందోల్‌లో కూడా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలల్లో కూడా పాల్గొనడం లేదు.

కాంగ్రెస్ పార్టీ తరపున ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసి, ఐదు సార్లు ఓటమి పాలయ్యారు. మూడు సార్లు గెలిచిన దామోదర్ రాజనరసింహ ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. దామోదర రాజనరసింహకు ఢిల్లీ స్థాయి వరకు కాంగ్రెస్‌లో మంచి పేరుంది. 2018 ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడ్డారు దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని. అప్పట్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి జగ్గారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో ఆమె అసంతృప్తితో బీజేపీలో చేరారు. అనంతరం మళ్లీ సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు. అప్పటి నుండే దామోదర క్రెజ్ కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది.

దామోదర రాజనర్సింహ పార్టీ మారుతున్నారు అనే ప్రచారం కూడా జోరుగా నడుస్తుంది. ఇప్పటికే పలు పార్టీల నేతలతో టచ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. మరో వైపు తనకు సంబంధించిన అనుచరులను అటు ఆందోల్ నియోజకవర్గంలో లేదా సంగారెడ్డిలోని తన సొంత ఇంట్లో నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు అని సమాచారం.

మరో వైపు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా వచ్చిన తరువాత ఆయనకి సపోర్ట్‌గా ఉంటూ వచ్చిన దామోదర రాజనర్సింహ.. ప్రస్తుతం దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాదు.. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలతో పాటు, జిల్లాలో జరిగే పార్టీ ప్రోగ్రాంలకు దూరంగా ఉంటూ.. అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతను ముందు దామోదరకి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థి ఎంపికలో మాత్రం ఆయన పాత్ర లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో దామోదర కొంచెం అలక పూనినట్టుగా తెలుస్తుంది.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పుంజుకుంటుంది అనుకున్న సమయంలో కొంతమంది నేతలు పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలు ఆ పార్టీ శ్రేణుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. అందులోనూ దామోదర రాజనరసింహ పార్టీ మారుతారని, ఇప్పటికే బీజేపీ నేతలు అయనకి టచ్ లోకి వెళ్లరనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దామోదర రాజనర్సింహ కూతురు త్రిష బీజేపీలోకి చేరాలని దామోదర్ పై ఒత్తిడి తెస్తున్నరని సమాచారం.

మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా, సీనియర్ నాయకుడిగా ఉన్న దామోదర రాజనరసింహ.. ఒక్కసారిగా సైలెంట్ కావడం చర్చనీయాంశం అయ్యింది. మరి దామోదర కాంగ్రెస్ లోనే ఉంటారా.. లేదా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాలి.

Also read:

Viral Video: మాంచి ప్లేస్‌ చూసుకుని మరీ రెచ్చిపోయాయి.. కుక్కల గ్యాంగ్ వార్.. చూస్తే గుండెలదిరిపోతాయి..!

Russia Ukraine War: తక్షణమే ఖార్కివ్ నుండి బయటపడండి.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ గంటలో రెండో ఆదేశం!

Pathan: ఎట్టకేలకు ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించిన బాలీవుడ్ బాద్‌షా.. పఠాన్ రిలీజ్‌ డేట్‌ను చెప్పేసిన షారుఖ్‌..