AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన MPలు, MLAలు, సర్పంచ్‌లు, MPTCల నెల జీతం ఎంతో తెలుసా..?

బేసిక్ జీతం కంటే అలవెన్సులే ఎక్కువగా అందుకుంటున్న ప్రజాప్రతినిధుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో ఎమ్మెల్యేలకు నెలకు రూ.20 వేలే బేసిక్ జీతం ఉన్నా, వివిధ భత్యాలతో మొత్తం ఆదాయం రూ.2.50 లక్షలకు చేరుతోంది. ఎంపీలు కూడా జీతం కంటే అలవెన్సుల ద్వారానే ఎక్కువగా పొందుతున్నారు.

మన MPలు, MLAలు, సర్పంచ్‌లు, MPTCల నెల జీతం ఎంతో తెలుసా..?
Public Representatives Salaries
Vijay Saatha
| Edited By: |

Updated on: May 03, 2026 | 2:19 PM

Share

మన ప్రజాప్రతినిధులు పొందే నెలవారీ వేతనం కంటే వారు అందుకునే ఇతర అలవెన్సులే అత్యధికంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు బేసిక్ శాలరీగా వచ్చేది రూ. 20 వేలే అయినా ఇతర భత్యాలన్నీ కలిపితే ఆ మొత్తం రూ. 2.50 లక్షలు దాటుతోంది.

శాసనసభ్యులకు ప్రభుత్వం ప్రతి నెలా నియోజకవర్గ అలవెన్స్ కింద రూ. 2.30 లక్షలను చెల్లించనుంది. ఇది కాకుండా ఒకవేళ వారు ప్రభుత్వ క్వార్టర్లలో నివసించకపోతే అదనంగా రూ. 25 వేల వసతి భత్యాన్ని కూడా పొందుతారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన రోజుల్లో ఒక్కో సభ్యుడికి రూ. 1000 దినసరి భత్యం లభిస్తుంది.

పార్లమెంటు సభ్యుల విషయానికి వస్తే వారి ప్రాథమిక జీతం రూ. 1.24 లక్షలుగా ఉంది. దీనికి అదనంగా ప్రతి నెలా నియోజకవర్గ భత్యం కింద రూ. 87 వేలు, కార్యాలయ నిర్వహణ కోసం మరో రూ. 75 వేలను కేంద్రం అందిస్తోంది. వీటితో పాటు ఏడాదికి 34 ఉచిత విమాన ప్రయాణాలు, ఏ రైలులోనైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు వారికి ఉంది.

స్థానిక సంస్థల ప్రతినిధులైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు వేతనాలు తక్కువగానే ఉన్నా ప్రభుత్వం వారికి ఉచిత రవాణా, ఇతర సౌకర్యాలను కల్పిస్తోంది. సర్పంచ్‌లు నెలకు రూ. 6,500 గౌరవ వేతనం పొందుతుండగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు రూ. 13 వేలను అందుకుంటున్నారు. పదవీ విరమణ తర్వాత కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలకు భారీగా పెన్షన్ సౌకర్యాలు ఉన్నాయి.

ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఖర్చుతోనే పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు ఉచితంగా అందుతాయి. ఎంపీలకు ఢిల్లీలో ఉచిత నివాసంతో పాటు ఏడాదికి 50 వేల యూనిట్ల విద్యుత్, 4 వేల కిలోలీటర్ల నీరు ఉచితంగా లభిస్తుంది. ప్రజాసేవ కోసం ఎన్నికైన వీరికి అందుతున్న ఈ భారీ ప్రయోజనాలపై ఇప్పుడు సామాన్యుల్లో చర్చ జరుగుతోంది.

 అసలు ఎవరీ మంగ్లీ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి..? 

Follow Us