రైతులతో పెట్టుకున్న కాంగ్రేస్- టీడీపీ ల పరిస్థితి ఏమైందో బీజేపీ తెలుసుకోవాలని హితవు చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో చేసినట్లు గుండాయిజం చేస్తామంటే కుదరదని, ఇది తెలంగాణ అనే విషయాన్ని మరిచిపోవద్దని అన్నారు. గుండా రాజకీయం చేస్తే బట్టలువిప్పి రైతులు ఉరికిచ్చి కొడతారని బీజేపీ నేతలకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దిమాక్ లేని ఎంపీ బండి సంజయ్.. ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ధాన్యం ఎందుకు కొనడం లేదని ధర్నాలు ప్రధాని మోడీ ముందు, కేంద్ర వ్యవసాయ మంత్రి ముందు చేస్తే బాగుంటుందని అన్నారు. బందిపోటు దొంగల్లాగా వ్యవహరిస్తే చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు. బురదజల్లే పార్టీగా బీజేపీ మారిందని, తగిన మూల్యం చెల్లించుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉండాలని అన్నారు. రైతులతో రాళ్ల వర్షం కురిపించుకుంటారో.. పూల వర్షం కురిపించుకుంటారో బీజేపీ నేతలే తేల్చుకోవాలని అన్నారు.
Also read:
Challan Pending: మామూలోడు కాదు.. చలానాల చిట్టా చూసి అవాక్కైన ట్రాఫిక్ పోలీసులు..!
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ బంధువులు సహా ఆరుగురు మృతి..