దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీఆర్ఎస్.. నాట్ ఫర్ సేల్.. అన్నది తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట. అన్ని చోట్ల కుదిరినట్లు.. అన్ని రాష్ట్రాల్లో బేరసారాలు ఆడినట్లు.. అధికార అహంకారం తెలంగాణ గడ్డపై సాగదని.. అది పాంహౌస్ ఫైల్స్‌లోనే నిరూపనైందని.. మునుగోడు సెంటర్‌లోనూ జెండా పాతేస్తాం.. ఢిల్లీ సెంటర్‌లోనూ ఎంటరవుతాం.. ఇందులో తగ్గేదేలేదన్నది గులాబీ ఫ్యూచర్ లీడర్ వెర్షన్. అయితే తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ తన లోకల్ ఐడెంటినీ వదులుకుని జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేంత అవసరం ఏమొచ్చింది..? గుజరాత్ మోడల్‌తో ప్రధాని అయిన మోదీ..? తెలంగాణ మోడల్‌తో గులాబీ బాస్ ఫ్యూచర్ పీఎం కాగలరా..? అన్న ప్రశ్నలకు కేటీఆర్ పూర్తిగా ఆన్సర్ ఇచ్చారు. దీంతోపాటు ప్రత్యర్ధుల ఆరోపణలు, ప్రశ్నలకు.. టీవీ9 బిగ్‌న్యూస్ బిగ్‌డిబేట్ వేదికగా మంత్రి కేటీఆర్ గట్టిగా సమాధానమిచ్చారు. బీజేపీపై యుద్ధం నుంచి బీఆర్ఎస్ అడుగుల వరకు.. మునుగోడు ఎన్నికల నుంచి గుజరాత్ మోడల్ వరకు.. అద్వానీ రథయాత్ర నుంచి అదానీల రుణమాఫీ వరకు.. పాన్ ఇండియా సినిమా నుంచి పాన్ ఇండియా పార్టీ వరకు.. ఫాంహౌస్ పైల్స్ నుంచి కశ్మీర్ ఫైల్స్ వరకు.. ఇలా అన్నింటికీ జవాబిచ్చిన మంత్రి కేటీఆర్.. బీజేపీ హిందుత్వ ఎజెండాపై కూడా మండిపడ్డారు. హిందుత్వ ఎజెండాతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతుందని.. విద్వేశాలను వ్యాపింపజేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటివి తెలంగాణలో కుదరవని.. బీజేపీ మత రాజకీయాలను నమ్ముకుంటే.. తాము మాత్రం ప్రజలను నమ్ముకున్నామని తెలిపారు.
అయితే.. హిందుత్వ అజెండాతో వెళ్తున్న బీజేపీ పార్టీని ఢీకొట్టేందుకు గులాబీ దళం ఎంచుకున్న మార్గమేంటి.. ఇలా ఏ టూ జెడ్ ప్రశ్నలకు బిగ్‌న్యూస్ బిగ్ డిబేట్ వేదికగా గులాబీ దళనాయకుడి మనసులో ఏముందో అన్నింటికి సమాధానం చెప్పారు. కల్వకుంట్ల రామారావు విత్ రజనీకాంత్ ఎపిసోడ్‌లో తాజా రాజకీయ పరిణామాలపై, బీజేపీ విధానంపై మాట్లాడారు.
రామబాణం లాంటి ప్రశ్నల అస్త్రాలకు.. రాముడు సూటిగా సుత్తిలేకుండా పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పిన విషయాలను ఈ కింది వీడియోలో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..