Dilsukhnagar Bomb Blast Case: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనకు 12 ఏళ్లు.. ఇవాళే తుది తీర్పు..!

Dilsukhnagar Bomb Blast Case: ఈ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేడు హైకోర్టు తీర్పు ప్రకటించనుంది. బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేసిన NIA ఈ కేసులో యాసిన్ భత్కల్ కీలక సూత్రధారిగా తేల్చింది. కేసులో ఐదుగురు నిందితులకు NIA స్పెషల్ కోర్టు..

Dilsukhnagar Bomb Blast Case: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనకు 12 ఏళ్లు.. ఇవాళే తుది తీర్పు..!

Updated on: Apr 08, 2025 | 8:04 AM

Dilsukhnagar Bomb Blast Case: 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ లో జరిగిన  బాంబు పేలుళ్ల ఘటనలో  18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలైన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన సంచలన రేపింది. ఉగ్రవాదులు టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి పేలుళ్లు సృష్టించారు. ఈ బాంబు పేలుడు కేసులో కీలక సూత్రధారిగా ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడుగా యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడు. ఈ కేసులో 157 మంది సాక్షులను విచారించిని ఎన్‌ఐఏ.. 2016లో యాసిన్‌ భత్కల్‌ సహా ఐదుగురికి ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్‌ఐఏ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు నిందితులు. ఇప్పటికీ ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ పరారీలో ఉన్నాడు.

అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ కేసులో నేడు హైకోర్టు తీర్పు ప్రకటించనుంది. బ్లాస్ట్ కేసును దర్యాప్తు చేసిన NIA ఈ కేసులో యాసిన్ భత్కల్ కీలక సూత్రధారిగా తేల్చింది. కేసులో ఐదుగురు నిందితులకు NIA స్పెషల్ కోర్టు ఉరి శిక్ష ఖరారు చేసింది. అయితే NIA కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో ఇప్పటికే ఈ కేసులో వాదనలు ముగిశాయి. దీంతో నేడు తీర్పు ప్రకటించనుంది తెలంగాణ హైకోర్టు.

2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ సమీపంలో కొద్ది నిమిషాల గ్యాప్లోనే రెండు పేలుళ్లు జరిగాయి. మొదట బస్టాండ్ ఎదురుగా ఒక బాంబ్ పేలిన కొద్దిసేపటికే..150 మీటర్ల దూరంలోనే మరో బ్లాస్ట్ సంభవించింది. టిఫిన్ బాక్సులో బాంబు పెట్టి.. టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌, అసదుల్లా అక్తర్‌, జియా-ఉర్‌-రెహమాన్‌, తెహసీన్‌ అక్తర్‌, అజాజ్‌ షేక్‌ కలిసి ఈ దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 157 మంది సాక్షులను విచారించి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి