Telangana: సమరానికి సై అంటోన్న తెలంగాణ ఉద్యోగులు.. కార్యాచరణ ఇదే

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరగా చెప్పిన మాటలు విని విసిగెత్తిపోయామంటున్నారు తెలంగాణ ఉద్యోగులు. పెండింగ్ బిల్లుల కోసం మరో పోరాటం చేస్తామంటున్నారు. వచ్చేనెల నుంచి సర్కార్‌పై ఇక సమరమేనంటున్నారు ఉద్యోగులు, పెన్షనర్లు. ఆ డీటేల్స్ అన్నీ ఈ కథనంలో తెలుసుకుందాం . .

Telangana: సమరానికి సై అంటోన్న తెలంగాణ ఉద్యోగులు.. కార్యాచరణ ఇదే
Telangana Govt Employees

Edited By: Ram Naramaneni

Updated on: Aug 20, 2025 | 9:22 PM

బీఆర్ఎస్‌ తమ సమస్యలను పరిష్కరించలేదని సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చామన్నారు తెలంగాణ ఉద్యోగులు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని వాపోయారు. పెండింగ్ బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదంటున్నారు. పదవీ విరమణ చేసిన వారికి సర్దుబాటు బిల్లులు ఇవ్వకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెన్షనర్లు . ఆరోగ్య పథకం కూడా సక్రమంగా అమలు కాలేదంటూ ఫైర్ అయ్యారు ఉద్యోగులు.  కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీలు వేస్తామని చెప్పి టైమ్ పాస్ చేస్తుందని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు.

సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందంటున్నారు ఉద్యోగుల జేఏసీ నేతలు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో పాత పెన్షన్ సాధన సదస్సు నిర్వహిస్తామన్నారు, సెప్టెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడుతామన్నారు. అక్టోబర్ 12న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని ప్రకటించింది ఉద్యోగుల జేఏసీ. పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు చెల్లించాలని నెలకు 700 కోట్ల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు ఉద్యోగులు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ అమలు, పీఆర్సీ అమలు, జీఓ 317 బాధితులకు న్యాయం చేయడంతో పాటు SSA ఉద్యోగుల వేతన సమస్య పరిష్కారించాలంటున్నారు ఎంప్లాయిస్.

ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నా ఆర్థిక శాఖ పట్టించుకోవడం లేదంటున్నారు మరికొందరు ఉద్యోగులు. ఈసారి పోరాటం మొదలైతే సమస్యలు పరిష్కారమయ్యే వరకు వెనక్కి వెళ్లే ప్రసక్తే ఉండదంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..