రాష్ట్ర గవర్నర్ తమిళి సై మరో కీలక నిర్ణయం… ఇకపై రోజూ పేదలకు రాజ్‌భవన్ భోజన రుచులు.. ఇవాళే లాంఛనంగా ప్రారంభం

|

Feb 08, 2021 | 11:14 AM

తెలంగాణకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్... ప్రతి పనిలో తన మార్క్ చూపిస్తున్నారు. తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.

రాష్ట్ర గవర్నర్ తమిళి సై మరో కీలక నిర్ణయం... ఇకపై రోజూ పేదలకు రాజ్‌భవన్ భోజన రుచులు.. ఇవాళే లాంఛనంగా  ప్రారంభం
Tamilisai Soundararajan
Follow us on

Raj Bhavan Annam Program : తెలంగాణకు గవర్నర్ అయిన తమిళి సై సౌందరరాజన్ మంచి మనసును చాటుకున్నారు. పేదలందరికీ రాజ భోజనాన్ని రుచి చూపించాలనుకున్నారు. ఇందుకు కోసం ఆమె.. తాజగా ఓ ప్రత్యేక పథకాన్ని అమలు చేయబోతున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా కొత్త పథకాన్ని ప్రకటించారు. రాజ్‌భవన్ అన్నం పేరుతో ఒక పథకాన్ని ఈ మధ్యాహ్నం గవర్నర్ తమిళసై స్వయంగా ప్రారంభించబోతున్నారు.

తెలంగాణకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్… ప్రతి పనిలో తన మార్క్ చూపిస్తున్నారు. తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ పేదలకు రాజ్ భవన్ భోజనం అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమాజీగూడలోని రాజ్‌భవన్‌లో ఈ స్కీంను కొనసాగించనున్నారు. ఈ పథకం ద్వారా రాజ్‌భవన్ ఆవరణలో రోజూ పేదలకు రెండుపూటలా భోజనం పెడతారు. మధ్యాహ్నం, రాత్రి సమయంలో పేదవారు ఈ సదుపాయాన్ని పొందవచ్చు.

అయితే, ఇది ఉచిత భోజన సదుపాయం కాదని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కొద్ది మొత్తంలో డబ్బు చెల్లించి తినవచ్చని తెలిపారు. ప్రతి రోజూ 500 మందికి తక్కువ ఛార్జీతో భోజనం పెట్టేలా దీన్ని రూపొందించినట్లు రాజ్ భవన్ అధికారులు తెలిపారు. ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఈ కార్యక్రమం పేదలకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. రాజ్‌భవన్‌లో ఈ పథకం అమలు చేస్తున్నందున.. భోజనం, కూరల విషయంలో కచ్చితంగా నాణ్యత పాటిస్తారని చెబుతున్నారు.

ఇదిలావుంటే, తెలంగాణ వ్యాప్తంగా రూ.5 భోజనం పథకాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి సమయంలో గవర్నర్ తమిళిసై తాజాగా ఆమె ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండటం ప్రాధన్యత సంతరించుకుంది. ఆమె మున్ముందు ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే అంశం హాట్ టాపిక్ అవుతోంది.

ఇదీ చదవండి… పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. పల్లె రాజేశ్వర్‌రెడ్డి పేరు ప్రకటించిన సీఎం కేసీఆర్