Womens Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై మరో అప్డేట్.. కీలక డెసిషన్ తీసుకున్న ఆర్టీసీ.. మహిళలకు టెన్షన్ ఫ్రీ..

మహాలక్ష్మి పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాలని టీజీఎస్‌ఆర్టీ ప్రతిపాదనలు పంపింది. దీంతో మరింత సమర్థవంతంగా ఈ పథకం అమలు చేసేందుకు బడ్జెట్‌లో భారీగా నిధుల కేటాయింపు ఉంటుందని సమాచారం. అలాగే స్మార్ట్ కార్డులపై కూడా మరో అప్డేట్ వచ్చింది.

Womens Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై మరో అప్డేట్.. కీలక డెసిషన్ తీసుకున్న ఆర్టీసీ.. మహిళలకు టెన్షన్ ఫ్రీ..
Free Bus

Updated on: Feb 20, 2026 | 10:28 AM

తెలంగాణలోని మహిళలకు మహాలక్షి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని రేవంత్ సర్కార్ అందిస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కడినుంచి ఎక్కడికైనా ఫ్రీగా జర్నీ చేసే అవకాశం లభించింది. ఈ పథకం వల్ల బస్సుల్లో రద్దీగా ఉండటంతో మరిన్ని ఎక్కువ కొత్త బస్సులను ప్రభుత్వం తీసుకొస్తుంది. అందులో భాగంగా త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు టీజీఎస్ఆర్టీసీ సిద్దమవుతోంది. మహాలక్ష్మి పథకంలో అనేక మార్పులు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటి వివరాలు ఏంటో చూద్దాం.

బడ్జెట్‌లో రూ.7 వేల కోట్లకు ప్రతిపాదన

త్వరలో తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ బడ్జెట్‌లో మహాలక్ష్మి పథకానికి భారీగా నిధులు కేటాయించనుందని తెలుస్తోంది. మొత్తం రూ.7 వేల కోట్లను రీయింబర్స్‌మెంట్ కింద కేటాయించాలని ప్రభుత్వానికి ఆర్టీసీ బడ్జెట్ ప్రతిపాదనలు పంపింది. ఇక వచ్చే ఆర్ధిక సంవత్సరంలో కొత్త బస్సులు కొనుగోలు కోసం రూ.241 కోట్లు కేటాయించాలని కోరింది. దాదాపు 680 కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సి ఉందని, వీటికి నిధులు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇక మౌలిక వసతుల కల్పన కోసం రూ.442 కోట్లు, బస్ పాస్‌ల రాయితీకి రూ.358 కోట్లు బడ్జెట్‌లో ప్రకటించాలని టీజీఎస్‌ఆర్టీసీ ప్రతిపాదించింది. ఒక కొత్త బస్టాండ్లు, డిపోల కోసం ప్రతిపాదనలు పంపారు,.

మహిళలకు తప్పనున్న తిప్పలు

ఇక మహిళలు సౌకర్యవంతంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకునేందుకు స్మార్ట్ కార్డులను ప్రభుత్వం తీసుకొస్తుంది. ప్రస్తుతం వీటి తయారీ జరుగుతోంది. రాష్ట్రంలోని అర్హులైన ప్రతీఒక్కరికీ ఈ కార్డులు పంపిణీ చేస్తారు. ఈ కార్డుపై క్యూఆర్ కోడ్‌తో పాటు పేరు, డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు ఉంటాయి. ఈ కార్డు ఉపయోగించి మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం జీరో టికెట్ కోసం ఆధార్ కార్డు చూపించాల్సి ఉండగా.. ఇందులో ఫొటోలో సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. కొన్నిసార్లు కండక్టర్లు, మహిళల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీనిని పరిష్కరించేందుకు స్మార్ట్ కార్డులను సర్కార్ తీసుకొస్తుంది. జూన్ 2వ తేదీ నుంచి మహిళలకు వీటిని జారీ చేయనున్నారు. ఈ కార్డుల తయారీ కోసం రూ.75 కోట్లు ఇప్పటికే కేటాయించింది. ఇప్పటికే అర్హులైన మహిళల వివరాలను సేకరిస్తున్నారు.  ఆ వివరాల ఆధారంగా స్మార్ట్ కార్డులను ప్రింట్ చేయనున్నారు. దీని వల్ల మహిళలు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా జస్ట్ ఈ కార్డు చూపించి ప్రయాణం చేయవచ్చు.

Follow Us