కరోనా సెకండ్ వేవ్ ఎంతటి డ్యామేజ్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్న రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులలోని జూనియర్ రెసిడెంట్ వైద్యులు తమ జీతాలను 15 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగబోతున్నట్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ క్రమంలో అలెర్టైన తెలంగాణ సర్కార్ జూనియర్ డాక్టర్లకు (హౌస్ సర్జన్లు, పీజీ), ఇంటర్న్ షిప్ చేస్తున్నవాళ్లకి 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది.
మెడికల్, డెంటల్ హౌస్సర్జన్లకు ఇక నుంచి నెలకు రూ.22,527 వస్తుంది. పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్ మొదటి సంవత్సరం వారికి నెలకు రూ.50,686 స్టయిఫండ్ ఇస్తారు. పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్ రెండో ఏడాది వారికి రూ. 53,503… పీజీ డిగ్రీ, ఎండీఎస్ మూడో ఏడాది వారికి రూ.56,319 ఇస్తారు. సూపర్ స్పెషాలిటీ మొదటి సంవత్సరం వారికి రూ. 56319, రెండో ఏడాది వారికి రూ.59135, మూడో సంవత్సరం వారికి రూ.61949 రూపాయలు స్టయిఫండ్ రానుంది.
……………………………..
హౌస్ సర్జన్ మెడికల్ కు గతంలో 19589 రూపాయలు స్టైఫండ్ వస్తుండగా.. తాజా ఉత్వర్వులతో వారికి 22527 రూపాయల స్టైఫండ్ రానుంది
హౌస్ సర్జన్ డెంటల్ కు గతంలో 19589 రూపాయలు స్టైఫండ్ వస్తుండగా.. తాజా ఉత్వర్వులతో వారికి 22527 రూపాయల స్టైఫండ్ రానుంది
పీజీ డిగ్రీ గతంలో ఇప్పుడు
ఫస్ట్ ఇయర్ 44075 50686
సెకండ్ ఇయర్ 46524 53503
ఫైనల్ ఇయర్ 48973 56319
పీజీ డిప్లమో గతంలో ఇప్పుడు
ఫస్ట్ ఇయర్ 44075 50686
సెకండ్ ఇయర్ 46524 53503
సూపర్ స్పెషాలటీ గతంలో ఇప్పుడు
ఫస్ట్ ఇయర్ 48973 56319
సెకండ్ ఇయర్ 51422 5 9135
థర్డ్ ఇయర్ 53869 61949
ఎమ్.డి.ఎస్ గతంలో ఇప్పుడు
ఫస్ట్ ఇయర్ 44075 50686
సెకండ్ ఇయర్ 46524 53503
థర్డ్ ఇయర్ 48973 56319
Also Read: కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్.. దరఖాస్తులకు గడువు..