మద్యం షాపు యజమానులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణలో నవంబర్ 1వ తేదీతో ఇప్పుడున్న 2,216 రిటైల్ లిక్కర్ షాపుల లైసెన్సులు ముగియనున్నాయి. ఈ లైసెన్సులు ముగిసిన తరువాత మద్యం షాపుల వేలం ప్రక్రియ ఉంటుంది. 2019 -21 సంవత్సరానికి రాష్ట్రంలో రిటైల్ మద్యం షాపుల లైసెన్సులను మరో నెల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రొహిబిషన్, ఎక్సయిజ్ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ఏ-4 రిటైల్ షాపుల లైసెన్సులను ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి ఆ నెల చివరి తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే.. లిక్కర్ షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. మద్యం షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్..
తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 17 (1 ) (V ) అనుసరించి ప్రభుత్వం ఏ- 4 రిటైల్ షాపుల లైసెన్సులను 2021 -23 సంవత్సరానికి గాను రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇవి కూడా చదవండి: Kerala High Court: కేరళ హైకోర్టు మరో సంచలన తీర్పు.. అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి..