Telangana Cabinet: కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం.. ఆయనకే డిప్యూటీ స్పీకర్‌ బాధ్యతలు

Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత కల్పించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్‌ సామాజిక వర్గాల నుంచి కేబినెట్‌లోకి గడ్డం వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి చోటు కల్పించారు..

Telangana Cabinet: కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం.. ఆయనకే డిప్యూటీ స్పీకర్‌ బాధ్యతలు

Updated on: Jun 08, 2025 | 12:17 PM

Telangana Cabinet Expansion: తెలంగాణ కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు చేరారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12.19 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ, సీఎం రేవంత్‌ తన టీమ్‌ను విస్తరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో లక్ష్మణ్‌, వివేక్‌, శ్రీహరి ఉన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌ అభినందనలు తెలిపారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత కల్పించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎస్సీ మాల, ఎస్సీ మాదిగ, బీసీ ముదిరాజ్‌ సామాజిక వర్గాల నుంచి కేబినెట్‌లోకి గడ్డం వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరికి చోటు కల్పించారు. వివేక్‌, లక్ష్మణ్‌ చేరికతో కేబినెట్‌లో దళిత మంత్రుల సంఖ్య నాలుగుకి చేరుతుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏడుగురు బీసీల్లో ముగ్గురికి మంత్రి పదవులు దక్కినట్లయింది.

ఇక శాసన సభలో ఉప సభాపతి బాధ్యతలు రామచంద్రు నాయక్ స్వీకరించారు. పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖతోపాటు కేబినెట్‌లోకి వాకిటి శ్రీహరి కూడా చేరారు. ఎస్టీ లంబాడాలకు డిప్యూటీ స్పీకర్‌ పదవి లభిస్తోంది. డోర్నకల్‌ నుంచి తొలిసారి గెలిచిన రామచంద్రునాయక్‌కి డిప్యూటీ స్పీకర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్టీ ఆదివాసీ నుంచి ఇప్పటికే మంత్రిగా సీతక్క కేబినెట్‌లో ఉన్నారు. అయితే ఈసారి విస్తరణలో రెడ్లకు చోటు దక్కలేదు.

ఇది కూడా చదవండి: Bank Account: ఇలా చేస్తే మీ బ్యాంకు ఖాతాను ఎవ్వరు కూడా హ్యాక్‌ చేయలేరు!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి